News March 25, 2024
HOLI: ఇంట్లోనే కలర్స్ చేసుకోండి

మార్కెట్లో దొరికే రంగుల్లో రసాయనాలు కలపడంతో చర్మానికి, కళ్లకు హాని కల్గుతుంది. అయితే ఇంట్లోనే కొన్ని వస్తువులతో మీరే కలర్స్ తయారుచేసుకోవచ్చు.
*ఎరుపు: పసుపులో నిమ్మరసం కలపి, ఆరబెట్టండి. లేదా దానిమ్మ తొక్కలను నీటిలో ఉడకబెట్టినా చాలు.
*పింక్: పసుపులో నిమ్మరసం తక్కువ మోతాదులో కలిపితే చాలు.
*ఆకుపచ్చ: గోరింట పిండిని బియ్యప్పిండి లేదా మైదాతో కలపండి.
*బ్రౌన్: కాఫీ పౌడర్ నీటిలో వేసి మరిగించండి.
Similar News
News January 13, 2026
ప్రభాస్ నన్ను వర్రీ కావద్దన్నారు: మారుతి

రాజాసాబ్ రిజల్ట్ విషయంలో ప్రభాస్ తనకు సపోర్ట్‌గా నిలిచినట్లు డైరెక్టర్ మారుతి తెలిపారు. ‘మూవీ గురించి ఎక్కువ అప్డేట్‌గా ఉన్నది ప్రభాసే. నిరంతరం నాతో టచ్‌లో ఉన్నారు. వర్రీ కావద్దన్నారు. కొత్త ప్రయత్నం చేశాం. ఆడియెన్స్‌కు చేరడానికి కొంత టైమ్ పడుతుందన్నారు. రీసెంట్‌గా ఓల్డ్ గెటప్ సీన్స్ యాడ్ చేశాక ఆయనకు మెసేజ్ చేశా. ఆ సీన్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయని అన్నారు’ అని మీడియా సమావేశంలో తెలిపారు.
News January 13, 2026
వైద్య శాఖకు ₹567 కోట్ల కేంద్ర నిధులు: మంత్రి

AP: రాష్ట్ర వైద్య శాఖకు కేంద్రం ₹567 కోట్లు విడుదల చేసిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం కింద ఇచ్చే ₹2600 కోట్లలో ఇవి చివరి విడత నిధులన్నారు. PHC భవనాలు, డయాగ్నొస్టిక్ పరికరాలు, ఇతర అభివృద్ధి పనులకు వీటిని వినియోగిస్తారు. కాగా FY25-26 నిధులు, ఖర్చుపై మంత్రి సమీక్షించారు. కేంద్ర నిధులను పూర్తిగా సాధించాలని అధికారులను ఆదేశించారు. విఫలమైతే సంబంధిత అధికారులే బాధ్యులని స్పష్టం చేశారు.
News January 13, 2026
విజయ్‌కు మరోసారి CBI నోటీసులు

కరూర్ తొక్కిసలాట ఘటనలో TVK పార్టీ అధినేత విజయ్‌కు <<18836427>>సీబీఐ<<>> మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 19న విచారణకు రావాలని ఆదేశించింది. కాగా నిన్న విజయ్‌ను సీబీఐ 7 గంటల పాటు ప్రశ్నించింది. గతేడాది జరిగిన ఆ తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయాలయ్యాయి.


