News March 23, 2025
NLG: వైజాగ్ కాలనీ కృష్ణా తీరంలో యువకుడి మృతి

నేరేడిగొమ్ము వైజాగ్ కాలనీ కృష్ణా తీరంలో బోడుప్పల్‌కు చెందిన యువకుడు మృతిచెందాడు. స్థానికుల వివరాలిలా.. HYDకు చెందిన కొందరు యువకులు ఆదివారం రాత్రి వైజాగ్ కాలనీకి విహారయాత్రకు వచ్చారు. ఉదయం కృష్ణా తీరంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి యువకుడు మృతి చెందాడు. వైజాగ్ కాలనీ బ్యాక్ వాటర్ వద్ద పర్యవేక్షణ ఉండదని, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు.
Similar News
News March 28, 2025
NLG: వడ్డీ కాసురులపై నజరేది?

NLG జిల్లాలో ఫైనాన్స్ వ్యాపారం ఇష్టారాజ్యంగా నడుస్తోంది. నిబంధనల ప్రకారం రూ.వందకు రూ.2 కు మించి వడ్డీ తీసుకోకూడదు. ప్రభుత్వ నుంచి అనుమతి తీసుకొని లెక్కలు పక్కాగా నిర్వహించాలి. అన్ని నిబంధనలు పాటిస్తూ ఫైనాన్స్ వ్యాపారం నడపాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో NLG, DVK, MLG, కట్టంగూర్, నకిరేకల్ ప్రాంతాల్లో చాలామంది ధనార్జనే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చిరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
News March 28, 2025
NLG: సంక్షోభంలో పౌల్ట్రీ రంగం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బర్డ్‌ఫ్లూ.. పౌల్ట్రీ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. ఇప్పటికే కొన్ని రోజులుగా కోళ్లు మృతి చెందుతుండడంతో పౌల్ట్రీ రైతులు ఆర్థికంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. బర్డ్‌ఫ్లూ కారణంగా 90 శాతం ప్రజలు చికెన్ తినడం మానేశారు. ఫలితంగా సదరు కోళ్ల కంపెనీ నిర్వాహకులు పౌల్ట్రీ రైతులకు కోడి పిల్లలు ఇవ్వడం పూర్తిగా మానేశారు. దీంతో వందలాది కోళ్ల ఫామ్ లకు తాళాలు పడ్డాయి.
News March 28, 2025
ఏప్రిల్ నాలుగో తేదీ వరకు పెన్షన్ల పంపిణీ

నల్గొండ జిల్లాలో ఆసరా పింఛన్లను ఏప్రిల్ 4వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీవో శేఖర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లు గీత, ఒంటరి మహిళలకు పింఛన్లను ఆయా పోస్టాఫీసుల్లో అందజేయనున్నట్లు తెలిపారు. పెన్షన్ పొందుటకు ఎలాంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.