News March 23, 2025
ఒంగోలు: పెళ్లి అయిన 9 రోజులకే మృతి

పెళ్లి అయిన 9 రోజులకే డాక్టర్ మృతి చెందిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన శివాచారి(32) డాక్టర్ చదువుకుని పెదకాకాని మండలంలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఈనెల 13న లావణ్యతో వివాహం చేశారు. రెండు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. వెంటనే విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Similar News
News March 29, 2025
మరో వివాదంలో బాలినేని..?

జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేనిపై మరో వివాదాస్పద ఆరోపణలు వస్తున్నాయి. నరసరావుపేట MP శ్రీకృష్ణదేవరాయలు బాలినేని పేరు ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఓ స్టోన్ క్రషర్ నిర్వాహకుల నుంచి మాజీ మంత్రి విడదల రజినీ రూ.2 కోట్లు వసూలు చేసినట్లు సీఐడీ కేసు నమోదు చేసింది. గతంలో అప్పటి మంత్రి బాలినేనితో మాట్లాడి క్రషర్ యజమానిపై రజిని కేసు పెట్టించిందని లావు చెబుతున్నారు.
News March 29, 2025
ఒంగోలు: ‘విద్యుత్ సర్ ఛార్జీలను రద్దు చేయాలి’

ఇంధన సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే. మాబు డిమాండ్ చేశారు. ఒంగోలులోని విద్యుత్ భవన్ వద్ద శుక్రవారం జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. ప్రజలపై భారాలు మోపడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
News March 28, 2025
ఒంగోలు: వివాదాలకు కేంద్ర బిందువుగా బాలినేని

అటు వైసీపీ ఇటు జనసేనలో మాజీ మంత్రి బాలినేని వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. నరసరావుపేట MP శ్రీకృష్ణదేవరాయలు బాలినేని పేరు ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం విజిలెన్స్ ఎస్పీ జాషువాపై ఒత్తిడి తీసుకువచ్చి బాలినేని స్టోన్ క్రషర్ నిర్వాహకుడిపై అభియోగం మోపినట్లు ఆరోపణలు చేశారు. కాగా స్టోన్ క్రషర్ నిర్వాహకుల వద్ద రూ.2 కోట్లు మాజీ మంత్రి రజిని వసూలు చేసినట్లుగా సీఐడీ కేసు నమోదు చేసింది.