News March 23, 2025

గుడ్‌న్యూస్: 100శాతం రాయితీతో రూ.50,000

image

TG: రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా చిరువ్యాపారాలు చేసే ఈబీసీలకు ప్రభుత్వం 100% రాయితీతో రూ.50వేల రుణం అందిస్తోంది. రూ.లక్షలోపు రుణాలకు 90% రాయితీ ఇవ్వనుంది. ఓ లబ్ధిదారుడు రూ.లక్ష తీసుకుంటే కేవలం రూ.10వేలు చెల్లిస్తే సరిపోతుంది. ఇక రూ.లక్ష నుంచి రూ.2లక్షల్లోపు రుణాలకు 80శాతం, రూ.2-4లక్షల్లోపు రుణాలకు 70శాతం రాయితీ ఇవ్వనుంది. నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.
వెబ్‌సైట్:<> tgobmmsnew.cgg.gov.in<<>>

Similar News

News March 30, 2025

సింగరేణి రికార్డ్.. ఒకే రోజు 3.25L టన్నుల బొగ్గు రవాణా

image

TG: సింగరేణి గనుల నుంచి ఈ నెల 28న 3.25 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసినట్లు సంస్థ సీఎండీ బలరాం తెలిపారు. 136 ఏళ్ల చరిత్రలో ఇదొక రికార్డని పేర్కొన్నారు. అధికారులు, కార్మికుల కృషితోనే ఇది సాధ్యమైందని చెప్పారు. రానున్న రోజుల్లోనూ ఇలాగే బొగ్గు ఉత్పత్తి చేస్తామన్నారు.

News March 30, 2025

ఇండోనేషియాలోనూ భూకంపం

image

ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రాంతంలో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత నమోదైందని ఆ దేశ భూకంప పరిశీలన కేంద్రం తెలిపింది. భూ ఉపరితలానికి 18 కి.మీ లోతున భూకంప కేంద్రం నెలకొని ఉందని పేర్కొంది. థాయ్‌లాండ్‌, మయన్మార్ దేశాలను భారీ భూకంపం కుదిపేసిన రోజుల వ్యవధిలోనే తమ వద్దా భూకంపం రావడంతో ఇండోనేషియావాసులు నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.

News March 30, 2025

గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల

image

TG: ఇటీవల గ్రూప్-1 మెయిన్స్ ప్రొవిజనల్ మార్కులను విడుదల చేసిన టీజీపీఎస్సీ ఇవాళ జనరల్ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేసింది. https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో లిస్టును అప్‌లోడ్ చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

error: Content is protected !!