News March 23, 2025
నిజామాబాద్ జిల్లాలో తగ్గిన ఎండ తీవ్రత

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత తగ్గింది. వేసవి కాలం అయినా.. శనివారం కోటగిరిలో అత్యధికంగా 38.5℃ ఉష్ణోగ్రత నమోదైంది. కమ్మర్పల్లి 38.3, ఏర్గట్ల, నందిపేట 38.1, నిజామాబాద్ సౌత్, వైల్పూర్ 38, మక్లూర్ 37.9, మోర్తాడ్, ముప్కల్ 37.6, జక్రాన్‌పల్లె, టోండకుర్, ఏడపల్లి 37.4, చిన్నమావంది 37.2, సాలూర 36.9, చిమన్‌పల్లె, మదన్‌పల్లె 36.8, ఇస్సాపల్లి 36.4, లక్మాపూర్ 36.1, కోరాట్పల్లిలో 36℃ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News July 11, 2025
వర్ని: పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని తల్లి హత్య..!

వర్ని మండలంలో దారుణం జరిగింది. జలాల్పూరులో పెన్షన్ డబ్బుల కోసం కన్నతల్లినే కొడుకు హత్య చేశాడు. SI మహేశ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయవ్వ(57)ను ఆమె కొడుకు సాయిలు పెన్షన్ డబ్బులు ఇవ్వాలని గొడవకు దిగాడు. ఈ క్రమంలో తల్లిపై కుర్చి, రాయితో దాడి చేసి పారిపోయాడు. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో చుట్టుపక్కల వారు బోధన్ ఆస్పత్రికి తరలించారు. సాయవ్వను పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.
News July 10, 2025
ఏపీ సీఎం చంద్రబాబుకు MLC కవిత లేఖ

APలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని MLC కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. భద్రాచలంలో అంతర్భాగంగా ఉండి ఏపీలో కలిసిన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలన్నారు. యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని కోరారు.
News July 10, 2025
NZB జిల్లాలో 51.11 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం: కలెక్టర్

ఈ ఏడాది వన మహోత్సవంలో జిల్లా వ్యాప్తంగా 51.11 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పక్షం రోజుల్లోనే పూర్తి స్థాయిలో మొక్కలు నాటి సంపూర్ణ లక్ష్యం సాధించేలా ముందస్తుగానే ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేశామన్నారు. గత సంవత్సరం వన మహోత్సవం సందర్భంగా 43 లక్షల మొక్కలు నాటారని చెప్పారు.