News March 23, 2025

ఆత్మకూరు: ‘రాజీవ్ యువ వికాసం’ గడువు పొడగింపు

image

రాష్ట్ర ప్రభుత్వం యువకులకు స్వయం ఉపాధి నిమిత్తం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం గడువును పొడిగించినట్లు వనపర్తి జిల్లా వెనుకబడిన సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి ఉమాదేవి తెలిపారు. ఈ పథకానికి ఈనెల 17 నుండి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. యువత ఇది అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9010185381 సంప్రదించాలని కోరారు.

Similar News

News March 29, 2025

సంగారెడ్డి: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు https://tgobmmsnew.cgg.gov.in వెబ్ సైట్‌లో ఏప్రిల్ 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. 21 నుంచి 55 ఏళ్లు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 29, 2025

నిజాంసాగర్: చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి మృతి

image

మద్యానికి బానిసై చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నిజాంసాగర్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేపల్లి గ్రామానికి చెందిన గుల బాలకృష్ణయ్య మద్యానికి బానిస అయ్యాడు. ఆరోగ్యం బాగా లేక వడ్డేపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

News March 29, 2025

మయన్మార్‌లో మరోసారి భూకంపం

image

తీవ్ర భూప్రకంపనలతో ఉలిక్కిపడిన మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. అంతకుముందు మయన్మార్‌, థాయిలాండ్‌లో 7.7 తీవ్రతతో భూకంపం రావడంతో భారీ భవనాలు నేలమట్టం అయ్యాయి. దాదాపు 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

error: Content is protected !!