News March 25, 2024

విజయనగరం ఎంపీ సీటు TDPకే..

image

AP: విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీయే బరిలోకి దిగనుంది. తొలుత పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించారు. అయితే తాజాగా కమలం పార్టీ విజయనగరానికి బదులు రాజంపేట ఎంపీ స్థానాన్ని తీసుకుంది. అక్కడి నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఇక విజయనగరం నుంచి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకటరావు బరిలోకి దిగే అవకాశముంది.

Similar News

News January 2, 2025

మంత్రుల కుంభకోణాలు బయటపెడతా: ఎమ్మెల్యే ఏలేటి

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.కోట్లల్లో భారీ కుంభకోణాలు జరిగాయని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ స్కాముల్లో పాలు పంచుకున్న మంత్రుల పేర్లను త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని తెలిపారు. దీనిపై సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూస్తామని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శించారు.

News January 2, 2025

ఈ ఏడాది ‘తల్లికి వందనం’ లేనట్లేనా?

image

AP: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఆర్థిక లోటుతో ఈ స్కీమ్‌ను ఇప్పట్లో అమలు చేయలేమని చెప్పేశారు. కాగా ఎన్నికలకు ముందు ప్రతి విద్యార్థికీ ‘తల్లికి వందనం’ వర్తింపజేస్తామని NDA కూటమి హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం రావడంతో 80 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని బాంబు పేల్చారు.

News January 2, 2025

సిడ్నీ టెస్టుకు భారత జట్టులో భారీ మార్పులు?

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ టెస్టు కోసం టీమ్ ఇండియా భారీ మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో శుభ్‌మన్ గిల్, ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక జట్టుకు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తారని టాక్. ప్రాబబుల్ జట్టు: బుమ్రా, రాహుల్, జైస్వాల్, గిల్, కోహ్లీ, పంత్, జడేజా, నితీశ్, సుందర్, ప్రసిద్ధ్, సిరాజ్.