News March 23, 2025

వచ్చే నెలలో కెనడాలో ఎన్నికలు

image

కెనడాలోని 338 పార్లమెంటు స్థానాలకు వచ్చే నెల 28న ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు కొత్త ప్రధాని కార్నీ త్వరలోనే ప్రకటన విడుదల చేయొచ్చని తెలుస్తోంది. కొత్త నాయకత్వం వచ్చాక అధికార లిబరల్ పార్టీవైపు ప్రజామోదం ఉన్నట్లు పలు సర్వేల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో పీఎం కార్నీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమైనట్లు సమాచారం.

Similar News

News March 29, 2025

ఈ విక్టరీ చాలా స్పెషల్ గురూ!

image

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో CSKపై RCB దాదాపు 17 ఏళ్ల తర్వాత విజయం సాధించింది. ఈ గ్రౌండ్‌లో చివరిసారిగా 2008లో చెన్నైను ఓడించిన బెంగళూరు.. మళ్లీ 6,155 రోజుల తర్వాత ఇప్పుడు గెలుపును నమోదు చేసింది. అందుకే ఈ విజయం RCBకి చాలా స్పెషల్. ఈ సీజన్‌లో పాటీదార్ సేనకు ఇది రెండో విజయం. 4 పాయింట్లతో ఆ జట్టు ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా ఉంది. ఈ ఫామ్‌ను ఇలాగే కొనసాగించి ఛాంపియన్‌గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News March 29, 2025

మా ఓటమికి అదే కారణం: రుతురాజ్

image

RCBతో మ్యాచులో తాము ఓడిపోవడానికి ఫీల్డింగ్ సరిగా చేయకపోవడమే కారణమని CSK కెప్టెన్ రుతురాజ్ అన్నారు. ‘ఈ పిచ్‌పై 170 మంచి స్కోర్. RCB 20 రన్స్ అదనంగా చేసింది. మా ఫీల్డర్లు కీలక సమయాల్లో క్యాచులు వదిలేశారు. పెద్ద టార్గెట్ ఛేజ్ చేస్తున్నప్పుడు కొంచెం భిన్నంగా బ్యాటింగ్ చేయాలి. ఆ ప్రయత్నంలోనే వికెట్లు కోల్పోయాం. కేవలం 50 రన్స్ తేడాతో ఓడాం. భారీ తేడాతో ఓడనందుకు సంతోషం’ అని పేర్కొన్నారు.

News March 29, 2025

మయన్మార్‌లో మరోసారి భూకంపం

image

తీవ్ర భూప్రకంపనలతో ఉలిక్కిపడిన మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. అంతకుముందు మయన్మార్‌, థాయిలాండ్‌లో 7.7 తీవ్రతతో భూకంపం రావడంతో భారీ భవనాలు నేలమట్టం అయ్యాయి. దాదాపు 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

error: Content is protected !!