News March 23, 2025

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపు టికెట్ల విడుదల

image

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జూన్‌కు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300 టికెట్) కోటా, వసతి టికెట్ల కోటా విడుదల తేదీని ప్రకటించింది. రేపు ఉదయం 10గంటల నుంచి దర్శనం టికెట్లు, రేపు మధ్యాహ్నం 3గంటల నుంచి వసతి టికెట్ల బుకింగ్‌ను ఓపెన్ చేయనుంది. ముందుగా రూ.300 టికెట్లు లేదా ఇతర దర్శనం టికెట్లు పొందినవారికి మాత్రమే వసతి గదుల బుకింగ్ సదుపాయం లభిస్తుంది.

Similar News

News November 11, 2025

తిరుమలలో మీకు ఈ ప్రాంతం తెలుసా?

image

7 కొండలపై ఎన్నో వింతలున్నాయి. అందులో ‘అవ్వచారి కోన’ ఒకటి. ఇది తిరుమలకు నడిచి వెళ్లే పాత మెట్ల మార్గంలో మోకాళ్ల మిట్టకు ముందు ఉండే ఓ లోతైన లోయ. పచ్చని చెట్లతో దట్టంగా, రమణీయంగా కనిపిస్తుంది. ఈ ప్రదేశానికి ఆ పేరు రావడానికి కారణం అవ్వాచారి అనే భక్తుడు. ఆయన ప్రేరణగా ఈ లోయకు ‘అవ్వాచారి కోన’ అనే పేరొచ్చిందని చెబుతారు. ఈ లోయ తిరుమల యాత్రలో భక్తులు దాటే ముఖ్యమైన ఘట్టంగా పరిగణిస్తారు.<<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 11, 2025

ప్రెగ్నెన్సీలో ప్రయాణాలు చేయొచ్చా?

image

ప్రెగ్నెన్సీలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. మొదటి 3నెలలు ప్రయాణాలు చేయకపోవడం మంచిది. తర్వాతి నెలల్లో ప్రయాణాలు చేసినా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికి వెళ్లినా రిపోర్టులు వెంట ఉంచుకోవాలి. కారులో వెళ్లే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, మధ్యమధ్యలో కాస్త నడవడం వంటివి చేయాలి. వదులుగా, సౌకర్యవంతంగా ఉండే దుస్తులు ధరించాలి. కాళ్లకి స్టాకింగ్స్ వేసుకోవాలి.

News November 11, 2025

మళ్లీ తల్లి పాత్రలో నటించను: మీనాక్షి చౌదరి

image

తన గురించి ఏమైనా చెప్పాలంటే సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తానని, రూమర్లు సృష్టించాల్సిన అవసరం లేదని హీరోయిన్ మీనాక్షి చౌదరి తెలిపారు. ‘లక్కీ భాస్కర్ కథ నచ్చి తల్లి క్యారెక్టర్ చేశా. ఇక అటువంటి పాత్రలు వస్తే నిర్మొహమాటంగా నో చెప్పేస్తా. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్న ‘విశ్వంభర’ నా కెరీర్‌లో స్పెషల్ చాప్టర్‌గా నిలిచిపోతుంది. సీనియర్ హీరోలతో నటించడానికి ఇబ్బంది లేదు’ అని మీనాక్షి చెప్పారు.