News March 23, 2025

గాంధేయవాది పసల కృష్ణభారతి మృతి

image

తాడేపల్లిగూడేనికి చెందిన గాంధేయవాది పసల కృష్ణభారతి (92) కన్నుమూశారు. హైదరాబాద్ స్నేహపురి కాలనీలోని ప్లాట్‌లో ఆమె మృతి చెందారు. 2022 జులైలో భీమవరం వచ్చినప్పుడు ప్రధాని ఆమె కాళ్లకు నమస్కరించారు. తాడేపల్లిగూడేనికి చెందిన పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మీ దంపతులకు కుమార్తె. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో కృష్ణమూర్తి దంపతులు కీలక పాత్ర షోషించారు. ఆ సమయంలో అంజలక్ష్మీ తంజావూరు జైలులో కృష్ణభారతికి జన్మనిచ్చింది.

Similar News

News January 11, 2026

ప.గో: ఖద్దరు ఓకే.. ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న ఖాకి!

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో రాజకీయ నేతలు ఇప్పటికే బిరుల(పందెం బరి) నిర్వాహకుల నుంచి సొమ్ములు వసూలు చేస్తుంటే ఖాకీలు మాత్రం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ అధికారి తాను చేప్పేవరరకు వరకు అమ్యామ్యాలు తీసుకోవద్దు అంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో పందాల నిర్వాహకులు మాత్రం ఆదేశాలు అందాయా.? లేదా.? అని పోలీసులను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

News January 11, 2026

ఉగ్రవాదులతో పాక్ ఆర్మీ దోస్తీ.. మరోసారి బయటపడిందిలా..!

image

పాక్ ఆర్మీకి ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలు మరోసారి బయటపడ్డాయి. పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్, లష్కరే తోయిబా నేత సైఫుల్లా కసూరి.. పాకిస్థాన్‌లోని ఒక స్కూల్ ఫంక్షన్‌లో ప్రసంగించడం వెలుగులోకి వచ్చింది. పాక్ ఆర్మీ తనకు ఇన్విటేషన్లు పంపుతుందని, చనిపోయిన సైనికుల అంత్యక్రియలకు తనని పిలిచి ప్రార్థనలు చేయిస్తారని బహిరంగంగానే ఒప్పుకున్నాడు. ఇండియా తనని చూస్తేనే భయపడుతుందంటూ ఈ వేదికపై విషం చిమ్మాడు.

News January 11, 2026

గేదె పాలకు ఉన్న ప్రత్యేకతలు ఇవే..

image

ఆవు పాలకంటే గేదె పాలలో ఎక్కువ కొవ్వు, ప్రొటీన్లు ఉంటాయి. ఈ పాలు చాలా చిక్కగా ఉండటం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. గేదె పాలలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండి ఎముకలను బలోపేతం చేస్తాయి. పెరాక్సిడేస్ అనే ఎంజైమ్ యాక్టివిటీ వల్ల ఆవు పాల కంటే ఇవి ఎక్కువ స‌మ‌యం నిల్వ ఉంటాయి. ‌మంచి శరీర సౌష్టవం, బరువు పెరగాలనుకువేవారికి గేదె పాలు మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.