News March 23, 2025

డీలిమిటేషన్‌పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: కిషన్ రెడ్డి

image

TG: దేశంలో లేని సమస్యను సృష్టించి, బీజేపీకి వ్యతిరేకంగా నిన్న చెన్నైలో డీలిమిటేషన్‌పై సమావేశం నిర్వహించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దక్షిణాది ప్రజల సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి పనిచేస్తోందని గుర్తు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. నిన్నటి సమావేశంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాత బంధం బయటపడిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Similar News

News March 29, 2025

నేడు బ్యాంకుల్లో పింఛన్ డబ్బులు జమ

image

AP: బ్యాంకులకు వరుసగా సెలవులు ఉండనున్న నేపథ్యంలో పింఛన్ల డబ్బులను ప్రభుత్వం ఇవాళే బ్యాంకుల్లో జమ చేయనుంది. ఎలాంటి జాప్యం లేకుండా నేడే బ్యాంకుల నుంచి నగదును విత్ డ్రా చేసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఆదేశించింది. ఏప్రిల్ 1న సిబ్బంది ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందజేస్తారు. కాగా ఈనెల 30న ఉగాది, 31న రంజాన్, ఏప్రిల్ 1న యాన్యువల్ క్లోజింగ్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉండనుంది.

News March 29, 2025

మయన్మార్‌కు భారత్ సాయం

image

భారీ <<15913182>>భూకంపంతో<<>> అతలాకుతలం అయిన మయన్మార్‌కు భారత్ అండగా నిలిచింది. ఆ దేశానికి 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్ పంపనుంది. ఇందులో ఆహార పదార్థాలతో పాటు నిత్యావసర సరకులు ఉండనున్నాయి. హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి IAF C-130J ఎయిర్‌క్రాఫ్ట్‌లో వీటిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

News March 29, 2025

భారత్‌లో WWE లైవ్ ఈవెంట్స్: ప్రెసిడెంట్

image

భారత్‌లో WWE లైవ్ ఈవెంట్స్ నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు ఆ కంపెనీ ప్రెసిడెంట్ నిక్ ఖాన్ వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ వేదికగా WWE ఎపిసోడ్స్ లైవ్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా నిక్ మాట్లాడుతూ ‘ఇండియాలో క్రికెట్ తర్వాత పాపులర్ స్పోర్ట్ WWE. అందుకే మాకు ఈ దేశ ప్రేక్షకులు ముఖ్యం. చాలా మంది ఒంటరిగా, ఫ్యామిలీతో కలిసి మా షోను చూస్తుంటారు’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!