News March 23, 2025

సూర్యాపేట: బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి

image

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని కుంటపల్లి గ్రామ శివారులో ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందాడు. మృతుడి పేరు యాకుబ్ కాగా అతనిది ఏపీ రాష్ట్రమని స్థానికులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Similar News

News September 17, 2025

మరో 3 గంటలు భారీ వర్షం.. జాగ్రత్త!

image

TG: హైదరాబాద్‌లో <<17744168>>వర్షం<<>> దంచికొడుతోంది. మరో 3 గంటలు వాన కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అటు రాబోయే 2-3 గంటల్లో ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల, యాదాద్రి, NZB, సూర్యాపేట, HNK, మేడ్చల్, ఉమ్మడి మెదక్ తదితర జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

News September 17, 2025

పోడు భూములకు రుణాలివ్వండి: కామారెడ్డి కలెక్టర్‌

image

అర్హులైన రైతులకు, పోడు భూములకు పంట రుణాలు వెంటనే అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆశీష్‌ సాంగ్వాన్‌ బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. వరదల వల్ల నష్టపోయిన ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. అనంతరం ‘స్వచ్ఛత హీ సేవ’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

News September 17, 2025

మధ్యాహ్నం రెండు గంటలలోపు రిపోర్ట్ చేయండి: DEO

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మెగా డీఎస్సీ 2025లో ఎంపికైన ఉపాధ్యాయులందరూ సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల లోపు గుంటూరులోని ఆంధ్ర ముస్లిం కళాశాలలో తప్పనిసరిగా రిపోర్టు చేయాలని డీఈవో చంద్రకళ సూచించారు. బుధవారం మాట్లాడుతూ.. ఎంపికైన ఉపాధ్యాయులకు అమరావతిలో 19వ తేదీన సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేస్తారని పేర్కొన్నారు. రిపోర్టు చేసిన ఉపాధ్యాయులకు ఐడీ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.