News March 23, 2025

GHMC కోసం ఒక్క ఏడాదిలో రూ.1600 కోట్లు..!

image

GHMC పరిధిలో లింక్ రోడ్ల అభివృద్ధి, CSR నిధుల ఫెసిలిటీ, రోడ్ల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏడాది కాలంలో రూ.1600 కోట్లను జీహెచ్ఎంసీకి విడుదల చేసిందని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ప్రభుత్వం నిధులు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News July 6, 2025

PLEASE CHECK.. ఇందులో మీ పేరు ఉందా?

image

AP: అన్నదాతా సుఖీభవ పథకానికి తాము అర్హులమో? కాదో? తెలుసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. https://annadathasukhibhava.ap.gov.in/లో చెక్ స్టేటస్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేస్తే రైతులకు తాము అర్హులమో కాదో అన్న వివరాలు తెలుస్తాయి. ఎందుకు <<16960279>>అనర్హత <<>>ఉందో కూడా కారణం తెలుసుకోవచ్చు. మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News July 6, 2025

నిర్మల్ జిల్లాకు భారీ వర్ష సూచన

image

నిర్మల్ జిల్లాలో ఈనెల 6 నుంచి 9 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈనేపథ్యంలో జిల్లాకు పింక్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలు ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని తెలిపారు.

News July 6, 2025

‘విశాఖ కేంద్ర కారాగారంలో రూ.10 కోట్లతో కొత్త బ్యారక్’

image

ఏపీలో ఉన్న వివిధ జైళ్లను రూ.103 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు జైళ్ల శాఖ ఐజీ డా.ఇండ్ల శ్రీనివాస్ తెలిపారు. దీనికి సంబంధించి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సిద్ధం చేసిన డిజైన్‌ను అప్రూవల్ కోసం ప్రభుత్వానికి పంపించామన్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో రూ.10 కోట్లతో 250 మంది సామర్థ్యం గల కొత్త బ్యారక్ నిర్మాణం జరుగుతుందన్నారు. విశాఖ జైలుని సందర్శించిన ఆయన ఈ మేరకు వివరాలు తెలియజేశారు.