News March 23, 2025

దేవాదుల పంప్ హౌస్‌ను సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు

image

హసన్‌పర్తి మండలంలోని దేవన్నపేట గ్రామంలో గల దేవాదుల పంప్ హౌస్‌ను ఆదివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు సందర్శించి మోటార్లను పరిశీలించారు. బీఆర్ఎస్ పాలనలోనే దేవాదుల నుంచి రైతులకు నీరు అందిందని.. ఈ కాంగ్రెస్ పాలనలో దేవాదుల ప్రాజెక్టు ను పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.

Similar News

News March 29, 2025

ప్రకాశం: మీకూ ఇలాంటి కాల్స్ వచ్చాయా..?

image

ప్రకాశం జిల్లాలో కాల్స్ చేసి బెదిరించడం ఎక్కువైపోయింది. ఈక్రమంలో SP దామోదర్ ఓ ప్రకటన చేశారు. ACB అధికారులమంటూ వచ్చే కాల్స్‌పై ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. తప్పు చేశారని.. అరెస్ట్ కాకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని ప్రజలు, అధికారులను బెదిరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫేక్ ఐడీ కార్డులతోనూ మోసాలు చేస్తుంటారని.. ఎక్కడైనా ఇలా జరిగితే 91211 02266కు వాట్సప్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు.

News March 29, 2025

జగిత్యాల: ఎస్సారెస్పీలో తగ్గుతున్న నీటి మట్టం

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గుతూ వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా శుక్రవారం నాటికి 1066.20 అడుగులకు తగ్గింది. అదేవిధంగా నీటి నిల్వ కూడా 17.557 టీఎంసీలకు చేరింది. ఎండ వేడికి రోజూ 434 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో తగ్గుతోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. అయితే యాసంగి పంటలకు కాల్వలు, ఎత్తిపోతల ద్వారా నీటి విడుదల కొనసాగుతోందని పేర్కొన్నారు.

News March 29, 2025

మైనర్ బాలికపై అత్యాచారం.. జీవిత ఖైదు

image

మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ చిత్తూరు ప్రత్యేక పోక్సో కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. గుడిపాల(మ) చిత్తపారకు చెందిన దినేశ్ జ.31 2022వ సం.లో బాలికను పెళ్లి చేసుకుంటానంటూ ఇంటి నుంచి తీసుకెళ్లాడు. కోరిక తీర్చాలంటూ బలవంతపెట్టగా ఆమె ఒప్పుకోలేదు. దీంతో కూల్ డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడు. నేరం రుజువు కావడంతో జడ్జి శిక్ష ఖరారు చేశారు.  

error: Content is protected !!