News March 23, 2025
త్వరలో కర్నూలులో క్యాన్సర్ ఆస్పత్రి: సత్యకుమార్ యాదవ్

AP: బలభద్రపురం క్యాన్సర్ కేసులపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ‘<<15850475>>బలభద్రపురం<<>>లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశాం. ఇంటింటికీ వెళ్లి వైద్యులు సర్వే చేస్తున్నారు. క్యాన్సర్ బాధితులకు చికిత్స అందిస్తున్నాం. త్వరలో కర్నూలులో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. తూ.గో జిల్లా బిక్కవోలు(M) బలభద్రపురంలో 200 మంది క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే.
Similar News
News March 28, 2025
BREAKING: టాస్ గెలిచిన CSK

చెన్నై వేదికగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నారు.
CSK: రచిన్ రవీంద్ర, రుతురాజ్, త్రిపాఠి, దీపక్ హుడా, సామ్ కర్రన్, జడేజా, ధోనీ, అశ్విన్, నూర్, మతీశా, ఖలీల్
RCB: కోహ్లీ, సాల్ట్, పడిక్కల్, రజత్, లివింగ్‌స్టోన్, జితేశ్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, యశ్ దయాల్
News March 28, 2025
డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై శుభవార్త

TG: గత ప్రభుత్వంలో మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. ఇంటి స్థలం లేని అర్హులకు వాటిని కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే లబ్ధిదారులే పూర్తిచేసుకునేలా ఆర్థిక సాయం అందించాలన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో బేస్‌మెంట్ పూర్తిచేసిన వారికి తొలి విడత రూ.లక్ష చెల్లించాలని సూచించారు.
News March 28, 2025
సేవింగ్స్ స్కీమ్స్.. వడ్డీ రేట్లు యథాతథం

స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను కేంద్రం యథాతథంగా కొనసాగించింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు ప్రస్తుత వడ్డీ రేట్లే ఉంటాయని తెలిపింది. సుకన్య సమృద్ధి యోజనకు 8.2%, మూడేళ్ల వ్యవధి డిపాజిట్లకు, PPFకు 7.1% ఉంటుంది. 115 నెలల కిసాన్ వికాస్ పత్రకు 7.5%, NCSకు 7.7%, నెలవారీ ఆదాయ పథకంపై 7.4% వడ్డీ ఉంటుంది. 2023-24 చివరి త్రైమాసికం నుంచి ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.