News March 23, 2025

కేసీఆర్‌పై నర్సారెడ్డి పోరాటానికి సంపూర్ణ మద్దతు: పొన్నం

image

మాజీ సీఎం కేసీఆర్‌పై గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంక్షారెడ్డి చేస్తున్న పోరుబాట పాదయాత్రకు ఆదివారం శామీర్ పేట శివారులో కలిసి సంఘీభావం ప్రకటించారు. చైర్మన్లు కల్వ సుజాత, వెన్నెల, పీసీసీ ప్రతినిధి హరి వర్ధన్ రెడ్డి సంఘీభావం తెలిపారు.

Similar News

News March 28, 2025

సోంపేట : మానసిక వికలాంగురాలిపై అఘాయిత్యం

image

సోంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలిపై అదే గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ సుంగారపు ప్రసాద్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

News March 28, 2025

SRPT: బకాయిదారుడి ఇంటి ముందు బైఠాయించిన అధికారులు

image

ఇంటి పన్ను చెల్లించడం లేదని మున్సిపల్ అధికారులు, సిబ్బంది బకాయిదారుడి ఇంటి ముందు బైఠాయించి వినూత్న నిరసన తెలిపారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో గురువారం జరిగింది. స్థానిక శిశు మందిర్ స్కూల్ కాలనీకి చెందిన బానోత్ భీమ ఇంటి పన్ను చెల్లించకపోవడంతో పలుమార్లు నోటీసులు పంపించారు. అయినా పన్ను చెల్లించకపోవడంతో ఇలా బకాయిదారుడి ఇంటి ముందు కూర్చొని అధికారులు నిరసన తెలిపారు.

News March 28, 2025

పెనగలూరు: అన్నను చంపిన తమ్ముడికి జీవిత ఖైదు

image

పెనగలూరు మండలం, ఓబిలి గ్రామానికి చెందిన బుర్రకట్ల మహేశ్వరయ్యను ఇనుప రాడ్డుతో తలపై మోది చంపిన తమ్ముడు బుర్రకట్ల ఈశ్వరయ్య చంపాడు. ఈకేసులో ముద్దాయికి జీవిత ఖైదు, రూ.2 వేల జరిమానా విధిస్తూ రాజంపేట 3వ అదనపు జిల్లా జడ్జి గురువారం తీర్పు చెప్పారు. 2020 సంవత్సరం జనవరి నెలలో నేరం చేసిన ముద్దాయికి ఎట్టకేలకు శిక్ష ఖరారు అయింది. కోర్టు తీర్పు ఒక గుణపాఠం కావాలని, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు.

error: Content is protected !!