News March 23, 2025
మావోయిస్టుల కోసం ఛత్తీస్‌గఢ్ కీలక నిర్ణయాలు

మావోయిస్టుల కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. లొంగిపోయిన నక్సలైట్లకు తక్షణసాయం కింద రూ.50వేలు, ఆయుధాలు సరెండర్ చేస్తే వాటి స్థాయిని బట్టి రూ.5లక్షల వరకు ఇవ్వనుంది. రూ.5లక్షలకు ఆపై రివార్డు ఉన్న నక్సల్స్ లొంగిపోతే ఇంటి లేదా వ్యవసాయ భూమి ఇస్తుంది. భూమి అందుబాటులో లేకపోతే రూ.2లక్షల నగదు అందజేయనుంది. అలాగే పెళ్లి కాని, వితంతు మహిళలకు రూ.లక్ష సాయం చేయాలని నిర్ణయించింది.
Similar News
News July 6, 2025
రేపటి నుంచి 8 గంటల ముందే..

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రిజర్వేషన్ ఛార్టుల ప్రిపరేషన్‌లో కొత్త విధానం జులై 7 నుంచి అమలు కానుంది. ఇప్పటివరకు రైలు బయల్దేరడానికి 4 గంటల ముందే ఛార్జ్ ప్రిపేర్ అవుతుండగా, రేపటి నుంచి 8 గంటల ముందే ఛార్ట్ ప్రిపేర్ కానుంది. మధ్యాహ్నం 2 గంటల్లోపు బయల్దేరే రైళ్ల ఛార్టులను ముందురోజు రాత్రి 9 గంటలకల్లా వెల్లడిస్తారు. దీనివల్ల బెర్త్ దొరకనివారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చు.
News July 6, 2025
కేసీఆర్ పాలనలో రైతు ఆత్మహత్యలు తగ్గాయి: హరీశ్ రావు

TG: పదేళ్ల KCR పాలనలో రైతు ఆత్మహత్యలు రికార్డు స్థాయిలో తగ్గాయని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా 2015-2022 మధ్య నమోదైన రైతు ఆత్మహత్యల డేటాను ఆయన షేర్ చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 2015లో 11.1% ఉండగా 2022 నాటికి 1.57%కి తగ్గినట్లు తెలిపారు. రుణమాఫీ, రైతు భరోసా పథకాలు, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్మాణంతో పలు కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైందన్నారు.
News July 6, 2025
4 బంతుల్లో 3 వికెట్లు

మేజర్ లీగ్ క్రికెట్‌లో ఆడమ్ మిల్నే అదరగొట్టారు. సియాటెల్ ఆర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి టెక్సాస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. 19వ ఓవర్‌లో తొలి 2 బంతులకు 2 వికెట్లు పడగొట్టిన అతడు 4వ బంతికి మరో వికెట్ తీసి సియాటెల్‌ను ఆలౌట్ చేశారు. దీంతో మొత్తం ఆ ఓవర్‌లో 4 బంతుల్లోనే 3 వికెట్లు పడగొట్టారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టెక్సాస్ 188 రన్స్ చేయగా ఛేజింగ్‌లో సియాటెల్ 137 పరుగులకే కుప్పకూలింది.