News March 23, 2025
భారత ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం: జైశంకర్

అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు కీలకమైనవని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ప్రస్తుతం ఐరోపా, US, UK, న్యూజిలాండ్‌తో ట్రేడ్ చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇకపై భారత ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం అనే విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు. గతంలో ఆసియా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్యం పోటాపోటీగా జరిగిందన్నారు. అయితే గల్ఫ్, పశ్చిమ దేశాలతో ఒప్పందాల్లోనే ఆర్థికంగా మిగులు సాధించినట్లు వివరించారు.
Similar News
News November 8, 2025
యుద్ధానికి సిద్ధం.. పాక్‌కు అఫ్గాన్ వార్నింగ్

పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య మరోసారి చర్చలు విఫలం అయ్యాయి. తుర్కియే, ఖతర్ మధ్యవర్తిత్వంలో ఇవాళ ఇస్తాంబుల్‌లో జరిగిన శాంతి చర్చలు పురోగతి లేకుండానే ముగిశాయి. పాకిస్థాన్ కారణంగానే ఈ సందిగ్ధత ఏర్పడిందని అఫ్గాన్ ఆరోపించింది. అవసరమైతే తాము యుద్ధానికైనా సిద్ధమని పాక్‌ను తాలిబన్ సర్కార్ హెచ్చరించింది. ఇక నాలుగో విడత చర్చలకు ఎలాంటి ప్రణాళికలు లేవని పాక్ ప్రకటించింది.
News November 8, 2025
కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టులో జియోకు 2 ఎకరాలు

TG: కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టులో రిలయన్స్ కంపెనీ జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు దాదాపు 2 ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం కేటాయించింది. మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్లో ఈ భూమిని ఇచ్చారు. ఆ సంస్థ ఈ భూమిలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయనుంది. ప్రభుత్వం కొన్ని షరతులతో జీఓ విడుదల చేసింది. కేంద్ర అటవీ నిబంధనలకు లోబడి ఈ భూమిని కేటాయిస్తున్నట్లు వెల్లడించింది.
News November 8, 2025
ALERT: డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?

డిజిటల్, ఆన్‌లైన్ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టేవారు అప్రమత్తంగా ఉండాలని సెబీ హెచ్చరించింది. ఈ విధానం తమ పరిధిలోకి రాదని, మోసాలకు తాము బాధ్యత వహించలేమని స్పష్టం చేసింది. వాటిలో కౌంటర్ పార్టీ, ఆపరేషనల్ రిస్కులు ఉంటాయని పేర్కొంది. దీని వల్ల పెట్టుబడిదారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ETF, EGRsలే తమ పరిధిలోకి వస్తాయని, వాటి ద్వారా గోల్డ్ కొనుగోలు చేయడం సురక్షితమని వెల్లడించింది.


