News March 23, 2025
అమలాపురం నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారామ కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమలాపురం డిపో నుంచి ఏప్రిల్ 5న ఉదయం 8:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కళ్యాణం పూర్తయిన తర్వాత భద్రాచలం నుంచి అమలాపురం రావడానికి మధ్యాహ్నం1:30 నుంచి రాత్రి 7 గంటల వరకు బస్సులు నడుపుతామన్నారు.
Similar News
News March 29, 2025
వర్మగారూ మీ వైఖరి మార్చుకోండి: ముద్రగడ క్రాంతి

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి పదవి రాకపోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారణం కాదని ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అది టీడీపీ సొంత వ్యవహారమని, మీరూ మీరు తేల్చుకోవాలి కానీ జనసేనపై అక్కసు వెళ్లగక్కడం ఎంతమంత్రం తగదని ఆమె హెచ్చరించారు. మీరు వైసీపీలోకి వెళతారని, ఆ పార్టీ వాళ్లతో టచ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయన్నారు. ‘వర్మ గారు మీరు తీరు మార్చుకోండి’ అని ఆమె తెలిపారు.
News March 29, 2025
భర్త చేతిలో భార్య దారుణ హత్య

వెలుగోడు మండలం మోత్కూర్ గ్రామం మజార తిమ్మనీపల్లిలో భార్యను భర్త హత్య చేశాడు. పశువుల లక్ష్మీదేవి(35)ని భర్త చిన్న మధుకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం గొడ్డలితో తలపై కొట్టగా బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
News March 29, 2025
MHBD: HYDలో దంపతుల తగాదా.. భర్త మృతి

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కోబల్ తండాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. తండాకు చెందిన బానోత్ హుస్సేన్ హైదరాబాదులో ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల భార్యాభర్తల మధ్య తగాదా రావడంతో మనస్తాపం చెంది స్వగ్రామానికి చేరుకొని పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వివరించారు.