News March 23, 2025
ఈ నెల 31 వరకు గడువు: VZM కలెక్టర్

ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ కార్యక్రమం యువతకు సువర్ణ అవకాశమని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉందని కలెక్టర్ వెల్లడించారు. పది, ఇంటర్, డిగ్రీ తరగతులు, ఐటిఐ, డిప్లమో ఉత్తీర్ణులైన వారు ఇంటర్న్ షిప్ పొందవచ్చాన్నారు.
Similar News
News March 28, 2025
VZM: శుభలేఖ సుధాకర్, SP శైలజకు జీవిత సాఫల్య పురస్కారం

ప్రముఖ సినీ నటుడు శుభలేఖ సుధాకర్, సినీ నేపథ్య గాయని ఎస్పీ శైలజకు కళాపీఠం జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నామని కళా పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు బిఏ నారాయణ తెలిపారు. ఏప్రిల్ 1 న ఆనంద గజపతి కళాక్షేత్రంలో కళా పీఠం నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేయనున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గాయని పద్మభూషణ్, గానకోకిల పి.సుశీల పాల్గొంటారన్నారు.
News March 28, 2025
VZM: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ఎస్.కోట మండలం కొత్తూరు సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బసనబోయిన కార్తీక్ (21) మృతి చెందాడు. ఇతను తన స్నేహితులతో కలసి ఎస్.కోట నుంచి స్కూటీపై ఎల్.కోట పండక్కి వెళ్తున్న నేపథ్యంలో కొత్తూరు సమీపంలో ఎదురుగా వస్తున్న బైకు ఢీకొట్టింది. స్కూటీపై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఎస్.కోట పీహెచ్సీకి తరలించగా కార్తీక్ మృతి చెందినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు.
News March 28, 2025
విజయనగరం: ఉప ఎన్నికల్లో YCP క్లీన్ స్వీప్

విజయనగరం జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానాల్లో గురువారం నిర్వహించిన ఉప ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. భోగాపురం వైస్ ఎంపీపీగా పచ్చిపాల నాగలక్ష్మి (వైసీపీ) ఎన్నిక కాగా, వివిధ మండలాల్లో మరో పది స్థానాల్లో జరిగిన ఉప సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంతకవిటి మండలంలోని మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడిగా వైసీపీకి చెందిన షేక్ హయ్యద్ బీబీ ఎన్నికయ్యారు.