News March 23, 2025
హెచ్చరిక: అలా చేస్తే ఇక లైసెన్స్ రద్దు?

TG: తరచూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వాహనదారులకు షాక్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నట్లు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వాటిని మళ్లీ పునరుద్ధరించకపోవడమే కాక వారి వాహనాల రిజిస్ట్రేషన్లు కూడా చేయబోమని పేర్కొన్నారు. త్వరలోనే ప్రభుత్వం ఈ నిబంధనను అమలుచేయనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 28, 2025
ఏప్రిల్ 9 వరకు వంశీ రిమాండ్ పొడిగింపు

AP: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్‌ను సీఐడీ కోర్టు ఏప్రిల్ 9 వరకు పొడిగించింది. దీంతో ఆయనను విజయవాడ జైలుకు తరలించారు. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఎస్సీ, ఎస్టీ కోర్టు వంశీ రిమాండ్‌ను ఏప్రిల్ 8 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.
News March 28, 2025
మా శ్రమతోనే BYD రాష్ట్రానికి వచ్చింది: కేటీఆర్

TG: తాము అధికారంలో ఉన్నప్పుడు పడ్డ శ్రమ రాష్ట్రానికి ఇప్పుడు ఫలితాల్ని ఇస్తోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్విటర్‌లో తెలిపారు. ‘BYD రాష్ట్రంలో 10బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు 2022-23లో ఒప్పందం చేసుకున్నాం. కేంద్రం కారణంగా అప్పట్లో అది ఆగింది. ఆ పెట్టుబడులు ఎట్టకేలకు రాష్ట్రానికి వస్తుండటం సంతోషం. కేవలం మా ప్రభుత్వ విధానాల వల్లే ఇది సాధ్యమైంది’ అని పేర్కొన్నారు.
News March 28, 2025
RCB గెలుపు దాహం తీర్చుకుంటుందా?

IPLలో భాగంగా ఇవాళ చెపాక్ స్టేడియంలో RCBvsCSK మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన ఊపును ఇవాళ కూడా కొనసాగించాలని CSK భావిస్తోంది. పైగా ఈ స్టేడియంలో బెంగళూరుపై చెన్నైదే పైచేయి. ఇక్కడ చివరగా 17 ఏళ్ల క్రితం 2008లో CSKపై RCB గెలిచింది. ఆ తర్వాత ఏడు మ్యాచులు ఆడితే ఒక్కటీ గెలవలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలిచి సత్తా చూపెట్టాలని RCB వ్యూహాలు రచిస్తోంది.