News March 23, 2025

విశాఖ రానున్న మంత్రి కందుల దుర్గేష్

image

ఏపీ రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సోమవారం విశాఖ రానున్నారు. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 10 గంటలకు రుషికొండ బీచ్ ప్రాంతానికి వస్తారు. అనంతరం ఋషికొండ దగ్గర బ్లూ ఫ్లాగ్‌ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరిస్తారు. అక్కడ నుంచి విశాఖ సర్క్యూట్ హౌస్‌కి వెళ్లి ముఖ్య నాయకులతో సమావేశమై సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుంచి గన్నవరం వెళ్లనున్నారు.

Similar News

News March 26, 2025

విశాఖ ఉక్కులో మోగనున్న సమ్మె సైరన్

image

విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ నెల 28న ఒక్క రోజు సమ్మెకి కాంట్రాక్ట్ కార్మికుల సంఘాలు పిలుపునిచ్చాయి. సంబంధిత కరపత్రాలను గేటు వద్ద మంగళవారం పంపిణీ చేశారు. కార్మికుల తొలగింపునకు నిరసనగా అఖిలపక్ష కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి. ఉక్కు యాజమాన్యం కార్మికులకు మెడికల్ టెస్టుల పేరుతో తొలగించే ప్రయత్నాలు చేస్తున్నాయని, ఈ సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు.

News March 25, 2025

విశాఖలో 50% వడ్డీ పై రాయితీ: కలెక్టర్

image

జీవీఎంసీ పరిధిలో గృహ యజమానులు, ఆస్తిపన్ను చెల్లింపుదారులు మార్చి 31లోపు ఆస్తి పన్ను చెల్లిస్తే 50శాతం వడ్డీ పై రాయితీ మినహాయింపును పొందవచ్చని కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ ఎంఎన్ హరింధిర ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నగర ప్రజలు సౌకర్యార్థం, ప్రతీ వార్డు సచివాలయంలో ఆస్తిపన్ను బకాయిలను చెల్లించవచ్చు అన్నారు. మార్చి 30 ఆదివారం కూడా జోనల్ కార్యాలయాల్లో కేంద్రాలు పనిచేస్తాయన్నారు.

News March 25, 2025

డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

విశాఖ జిల్లాలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ & రీసెర్చ్ సెంటర్లు, రీజినల్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లకు దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు ఉప రవాణా కమీషనర్ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రవాణా శాఖ మార్గదర్శకాల ప్రకారం అర్హతగల సంస్థలు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ www.morth.nic.in లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!