News March 23, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదిక వేళలు ఇవే: కలెక్టర్

నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎండలను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమానికి వచ్చే ప్రజలెవ్వరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఉదయం 9.30 గంటలకే అర్జీల స్వీకరణ చేపడతామన్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.
Similar News
News November 6, 2025
పరకామణి చోరీ కేసు.. 30మందితో విచారణ

తిరుమల పరకామణి చోరీ కేసులో విచారణ మొదలైంది. ఐదు బృందాలుగా అధికారులు ఏర్పడ్డారు. 20 మంది ప్రత్యక్షంగా, 10 మంది అధికారులు ఆఫీస్ నుంచి విచారణ కొనసాగించనున్నారు. డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీ గంగాధర్, ముగ్గురు డీఎస్పీలు, ఫోరెన్సిక్, సైబర్, ఐటీ విభాగం, లీగల్ విభాగం సభ్యులు విచారణలో పాల్గొంటారు. 28రోజుల్లో విచారణ పూర్తి చేసి హైకోర్టులో నివేదిక సమర్పించనున్నారు.
News November 6, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 15 మంది పోలీసుల బదిలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో 15 మంది పోలీసులకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు ఎస్పీ సతీశ్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఏఎస్సై, ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్, 11 మంది కానిస్టేబుల్స్ ఉన్నారు. వీరంతా బదిలీ అయిన స్థానాల్లో 3 రోజుల్లో బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News November 6, 2025
ఈనెల 27న సింగపూర్‌కు బెస్ట్ టీచర్లు: లోకేశ్

AP: 78మంది బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను ఈనెల 27న సింగపూర్ పంపే ఏర్పాట్లు చేయాలని మంత్రి లోకేశ్ అధికారులకు సూచించారు. ‘విద్యా విధానాలపై అధ్యయనానికి బెస్ట్ టీచర్లను సింగపూర్ పంపిస్తున్నాం. స్టూడెంట్ అసెంబ్లీకి ఏర్పాట్లు చేయాలి. డిసెంబర్ 5న మెగా పేరెంట్ టీచర్ మీట్‌కు పెట్టాలి. ఇందులో ప్రజా ప్రతినిధులను భాగం చేయాలి. రాష్ట్రంలో కడప మోడల్ స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి’ అని ఆదేశించారు.


