News March 23, 2025

పెంచికల్పేట్: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం: MLC

image

మారుమూల గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యమని MLC దండే విఠల్ పేర్కొన్నారు. పెంచికల్పేట్ మండల కేంద్రంలో నూతన సీసీ రోడ్లకు ఆదివారం ఎమ్మెల్సీ దండే విఠల్ భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలో రూ.45 లక్షలతో సీసీ రోడ్లు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, దారుగపల్లి, చేడువాయి గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Similar News

News November 6, 2025

మొత్తానికి ట్రంప్‌కు పీస్ ప్రైజ్ వచ్చేస్తోంది!

image

తరచూ ఏదో ఓ ప్రకటనతో ప్రపంచానికి మనశ్శాంతి దూరం చేస్తున్న ట్రంప్‌కు ఎట్టకేలకు శాంతి బహుమతి రానుంది. నోబెల్ NO అన్న అమెరికా పెద్దన్నను అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ఆదుకుంటోంది. వాషింగ్టన్‌లో వరల్డ్ కప్ డ్రా వేదికపై ఈ సారి కొత్తగా FIFA Peace Prize ఇస్తామని ప్రకటించింది. FIFA చీఫ్ గయానీ ఫుట్‌బాల్-పీస్ రిలేషన్‌ను అతికిస్తూ వివరించిన ప్రయత్నం చూస్తుంటే ఇది తన శాంతి కోసమే అన్పిస్తోంది.

News November 6, 2025

వేములవాడ: పరిహారం ఇవ్వండి.. లేదా గెజిట్ నుంచి తొలగించండి..!

image

నష్టపరిహారం చెల్లించకుండా అపరిష్కృతంగా ఉన్న తమ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని రైల్వే లైన్ నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు వేములవాడలో నిరసన వ్యక్తం చేశారు. తమ భూములకు వెంటనే పరిహారం చెల్లించాలని, లేదంటే భూములు అమ్ముకునేందుకు వీలుగా గెజిట్ నుంచి తొలగించాలని వారు విజ్ఞప్తి చేశారు. పరిహారం చెల్లించకుండా, గెజిట్ నుంచి తొలగించకుండా తాత్సారం చేయడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు.

News November 6, 2025

ఖమ్మం: మాయమై పోతున్నడమ్మా.. మనిషన్న వాడు..!

image

మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. క్షణికావేశంలో, డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఇటీవల తిరుమలాయపాలెం(M)నికి చెందిన ఒక వ్యక్తి మద్యానికి డబ్బులు ఇవ్వడం లేదని కన్నతల్లినే గొడ్డలితో నరికి హత్య చేశాడు. సత్తుపల్లిలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని భార్యని ఓ వ్యక్తి హతమార్చాడు. ఖమ్మం(R)లో సోదరుల మధ్య పంచాయితీలో తమ్ముడిని అన్న హత్య చేశాడు. చింతకాని(M)లో వివాహేతర సంబంధంతో ఓ భార్య భర్తను చంపింది.