News March 23, 2025

కోనసీమ: రేపు యథావిధిగా మీకోసం వేదిక: కలెక్టర్

image

అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన అమలాపురం నుంచి ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 26, 2025

వరంగల్: అంగన్వాడీ కేంద్రాలకు కందిపప్పు సరఫరాకు టెండర్ 

image

వరంగల్ జిల్లాలోని 670 అంగన్వాడీ కేంద్రాలకు కందిపప్పు సరఫరా చేయడానికి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి రాజమణి  తెలిపారు. నర్సంపేట, వర్ధన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని కేంద్రాలకు 2025 ఏప్రిల్ నుంచి మార్చి 2026 సంవత్సరం వరకు సరఫరా చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈనెల 28లోగా దరఖాస్తులు అందచేయాలని మరిన్ని వివరాల కోసం జిల్లా సంక్షేమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

News March 26, 2025

గద్వాల: కోర్టు సముదాయానికి రూ.81కోట్లు మంజూరు

image

గద్వాల జిల్లాకు కొత్త సమీకృత కోర్టు సముదాయ భవనం మంజూరైందని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న న్యాయస్థానం నిర్మాణనికి రూ.81 కోట్ల నిధులు విడుదల అయినట్లు అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

News March 26, 2025

వరంగల్: బస్టాండ్ నిర్మాణ పనుల్లో బాంబుల వినియోగం

image

వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనుల్లో ఆనధారితంగా బస్టాండ్ నిర్మాణం పనుల్లో బాంబులు ఉపయోగిస్తున్నారని ప్రజలు తెలిపారు. పునాది పనుల్లో  బాంబు పేలడంతో భూపాలపల్లి డిపో బస్సు అద్దాలు పగిలినట్లు ప్రజలు తెలిపారు. ప్రయాణికులు తప్పిన పెనుముప్పు. పోలీస్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.  

error: Content is protected !!