News March 23, 2025
నిజామాబాద్‌లో పలువురి ఘర్షణ

నిజామాబాద్ నగరంలో ఆదివారం కలకలం చెలరేగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరగగా కత్తి పోట్లు జరిగాయని పుకార్లు షికార్లు చేశారు. వివరాల్లోకి వెళితే మిర్చి కాంపౌండ్‌లో హబీబ్ నగర్‌కు చెందిన మహమ్మద్‌కు మిర్చీ కాంపౌండ్‌కు చెందిన అజ్జుకు, మరో వ్యక్తికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా తోపులాటలో మహమ్మద్‌కు అక్కడ ఉన్న ఓ ఇనుప రాడ్డు గుచ్చుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 11, 2025
NZB: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

నిజామాబాద్ మూడవ టౌన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు SI హరిబాబు గురువారం తెలిపారు. పంబౌలి ఏరియాలో గంజాయి విక్రయిస్తున్నారనే పక్క సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో షేక్ అఫ్రోజ్, షేక్ అయాజ్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరు నుంచి 238 గ్రాముల గంజాయిని స్వాధీన పరుచుకొని, రిమాండ్‌కు తరలించారు.
News July 11, 2025
NZB: న్యూసెన్స్ చేసిన వ్యక్తికి 7 రోజుల జైలు: SHO

మద్యం అతిగా సేవించి రైల్వే స్టేషన్ ఏరియాలో న్యూసెన్స్ చేసి శాంతిభద్రతలకు ఆటంకం కలిగించిన షేక్ ఫెరోజ్ (30) అనే వ్యక్తికి 7 రోజుల జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి గురువారం తీర్పు చెప్పారని NZB వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మగడమునగర్‌కు చెందిన షేక్ ఫెరోజ్ బుధవారం రాత్రి రైల్వే స్టేషన్ వద్ద అతిగా మద్యం సేవించి హంగామా చేశాడన్నారు.
News July 11, 2025
NZB: జనాభా నియంత్రణకు కృషి చేయండి: DM& HO

జనాభా నియంత్రణకు సిబ్బంది కృషి చేయాలని నిజామాబాద్ DM&HO డాక్టర్ బి.రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించే కార్యక్రమాలపై వివిధ PHCల వైద్యాధికారులతో గురువారం జిల్లాస్థాయి సన్నాక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో DM&HO మాట్లాడుతూ తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతుల పట్ల ప్రజల్లో అవగాహణ కల్పించాలని సూచించారు.