News March 23, 2025

పంట నష్టం అంచనా వేయండి: అచ్చెన్న

image

AP: రాష్ట్రంలో కురిసిన వడగళ్ల వానపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాయలసీమ జిల్లాల్లో దెబ్బతిన్న ఉద్యాన పంటలను పరిశీలించాలని, నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. అలాగే అన్నదాతలకు అందుబాటులో ఉంటూ తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.

Similar News

News March 26, 2025

మల్లెలతీర్థం వల్లే SLBC ప్రమాదం!

image

TG: SLBC టన్నెల్ ప్రమాదానికి మల్లెలతీర్థం జలపాతమే కారణమని నిపుణులు అనుమానిస్తున్నారు. ఆ జలపాతం నీరే ఊటనీరుగా మారి సొరంగం పైకప్పును కూల్చేసినట్లు గుర్తించారు. దేవాదుల ప్రాజెక్టును చలివాగు ముంచేసినట్లుగానే ఈ ప్రాజెక్టును మల్లెలతీర్థం ముంచేసింది. టన్నెల్‌లోకి నిమిషానికి 3 వేల లీటర్ల ఊట రావడానికి కారణం ఇదే. ఇక్కడికి వచ్చే సీఫేజీ శ్రీశైలం రిజర్వాయర్‌ది కాదని వాటర్‌ఫాల్ నుంచి వస్తోందని నిర్ధారించారు.

News March 26, 2025

వరల్డ్ పర్పుల్ డే!

image

ఈరోజు ‘వరల్డ్ పర్పుల్ డే’. దీన్ని మూర్ఛవ్యాధి అవగాహన దినోత్సవం అని కూడా పిలుస్తుంటారు. మూర్ఛ గురించి అవగాహన పెంచడానికి, ఆ వ్యాధి గురించి ప్రజల్లో ఉన్న అపోహలు& భయాలను తొలగించడానికి ప్రతి ఏటా మార్చి 26న ఈ డేని నిర్వహిస్తారు. WHO ప్రకారం 50 లక్షల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. దీని బారిన పడిన కెనడాకు చెందిన కాసెడీ మేగాన్ 2008లో ‘పర్పుల్ డే’ను తీసుకొచ్చారు.

News March 26, 2025

రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్

image

IPLలో శ్రేయస్ అయ్యర్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. రెండు వేర్వేరు ఫ్రాంచైజీలకు కెప్టెన్‌గా ఆడిన తొలి మ్యాచులోనే 90+ స్కోర్ చేసిన క్రికెటర్‌గా నిలిచారు. 2018లో DC తరఫున KKRపై 93, నిన్నటి మ్యాచులో GTపై 97 రన్స్ చేశారు. అతను సెంచరీని త్యాగం చేసి శశాంక్ సింగ్‌ను షాట్స్ ఆడమని చెప్పడం వల్ల చివరి ఓవర్లో 23 రన్స్ వచ్చాయి. ఆ పరుగులే మ్యాచ్ చివర్లో కీలకంగా మారాయి. ఫలితంగా 11 రన్స్ తేడాతో PBKS విన్ అయింది.

error: Content is protected !!