News March 23, 2025

ఎన్టీఆర్: ఆ నిర్ణయంతో వేలాది మందికి చేకూరనున్న లబ్ధి 

image

2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్(RTF) కింద రూ.600కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ తాజాగా ట్వీట్ చేశారు. ఈ నిర్ణయంతో ఎన్టీఆర్ జిల్లాలోని వేలాది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. త్వరలో మరో రూ.400కోట్లు విడుదల చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. ఫీజు చెల్లించని విద్యార్థులను పరీక్షలకు అనుమతించని విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన Xలో హెచ్చరించారు.

Similar News

News September 19, 2025

సిర్పూర్(టి): పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి

image

సిర్పూర్ (టి) మండలం లోనవెల్లి గ్రామంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాల మేరకు ఈరోజు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2,770 నగదు, 52 పేక మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ తెలిపారు. పేకాట వంటి అనైతిక కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 19, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> రాష్ట్ర స్థాయి క్రీడలకు పాలకుర్తి విద్యార్థి ఎంపిక
> జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు
> యూరియా నిల్వలను పరిశీలించిన అదనపు కలెక్టర్
> కడియం రాజీనామా చేయాలని ఉత్తరాల ఉద్యమం
> రఘునాథపల్లిలో గంజాయి పట్టివేత
> అలుగు పోస్తున్న బొమ్మెర చెరువు
> జనగామ: ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
> USAలో బతుకమ్మ పండగకు మంత్రులకు ఆహ్వానం
> 30 లోపు ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

News September 19, 2025

కాగజ్‌నగర్: విజేతలకు బహుమతుల ప్రదానం

image

కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీ గ్రౌండ్‌లో నిర్వహించిన కబడ్డీ టోర్నీ విజేతలకు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబుతో కలిసి ఈరోజు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి కాగజ్‌నగర్ సెవెన్ స్టార్స్‌ జట్టుకు రూ.50,000, ద్వితీయ బహుమతి సిర్పూర్ బజరంగ్‌దళ్ టీమ్‌కు రూ.25,000, తృతీయ బహుమతి బెజ్జూరు మండలం అర్కగూడా టీంకు రూ.15,000 నగదుతో పాటు షీల్డ్‌లు అందజేశారు.