News March 23, 2025

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

image

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం కర్నూలు జిల్లా నూతన కార్యవర్గం ఆదివారం జిల్లా పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ భవన్ నందు ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా అధ్యక్షునిగా విద్యాసాగర్, సెక్రెటరీగా చంద్రమోహన్, కోశాధికారిగా సంధ్యా ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలపై రాజు లేని పోరాటాలు చేస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామన్నారు.

Similar News

News March 26, 2025

పత్తికొండ వాసి రామ్మోహన్‌కు సేవా పురస్కారం

image

పత్తికొండకు చెందిన కేపీఆర్ మైత్రి ఛారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్మోహన్ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. తన సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులు, నిరుపేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. పాండిచ్చేరిలో జరిగిన ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ అచీవర్స్ అవార్డు-2025 ప్రధానోత్సవంలో డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ అవార్డును అందుకున్నారు.

News March 25, 2025

కర్నూలు జిల్లా TODAY TOP NEWS..!

image

➤ కోడుమూరు ఘటన.. విద్యార్థిపై కేసు
➤ బెట్టింగ్ జోలికెళ్లొద్దు: కర్నూలు ఎస్పీ
➤ నవోదయ ఫలితాల్లో ఆస్పరిలో బార్బర్ కొడుకు ప్రతిభ
➤ ఆలూరు: వంట గ్యాస్ సిలిండర్ పేలి గాయపడ్డ వ్యక్తి మృతి
➤ శ్రీశైలం మల్లన్న దర్శనానికి 5 గంటల సమయం
➤ సీఎం సమావేశంలో జిల్లా కలెక్టర్
➤ నందవరంలో వినతులు స్వీకరించిన సబ్ కలెక్టర్
➤ ఎమ్మిగనూరులో 27న జాబ్ మేళా
➤కోసిగిలో గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి

News March 25, 2025

బెట్టింగ్ జోలికెళ్లొద్దు: కర్నూలు SP

image

ఐపీఎల్ వేళ యువత బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని కర్నూలు SP విక్రాంత్ పాటిల్ సూచించారు. ‘తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభమనే మాయలో పడకండి. అమాయక ప్రజలను మోసగించేందుకు ముఠాలు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. చట్టవిరుద్ధమైన బెట్టింగ్‌తో కొందరు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే 100/112కు సమాచారం ఇవ్వండి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం’ అని ఎస్పీ తెలిపారు.

error: Content is protected !!