News March 24, 2025
ఈనెల 31 లోగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి: జేసీ

ఈనెల 31లోగా రేషన్ లబ్దిదారులు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఏలూరు జిల్లాలోని పౌరసరఫరాల డిప్యూటీ తహశీల్దార్లను జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి ఆదేశించారు. ఈ ప్రక్రియను నూరు శాతం పూర్తి చేయాలన్నారు. ఏలూరు జిల్లాలో 1,56,000 యూనిట్లు ఇంకనూ ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈకేవైసీ అమలు చేసేందుకు అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయన్నారు.
Similar News
News July 5, 2025
25 కుటుంబాలను దత్తత తీసుకున్న దగ్గుపాటి అశ్రిత

అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కుమార్తె దగ్గుపాటి అశ్రిత పీ4 కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు. దగ్గుపాటి ఫౌండేషన్ తరఫున 25 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన స్వర్ణాంధ్ర-పీ4 ఫౌండేషన్ తొలి సమావేశంలో ఎమ్మెల్యే ఈ ప్రకటన చేశారు. దగ్గుపాటి అశ్రితను అధికారులు, పీ4 టీం సభ్యులు అభినందించారు.
News July 5, 2025
సిద్దిపేట: IIITకి 345 మంది ఎంపిక

బాసర IIITకి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 345 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఆయా జిల్లాల విద్యాధికారులు తెలిపారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా నుంచి 222 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. మెదక్ నుంచి 78, సిద్దిపేట నుంచి 45 మంది విద్యార్థులు ఎంపికైనట్లు వెల్లడించారు. IIITకి ఎంపికైన విద్యార్థులను ఆయా జిల్లాల విద్యాధికారులు అభినందించారు.
News July 5, 2025
మెదక్: IIITకి 345 మంది ఎంపిక