News March 24, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అదివారం రూ.2,97,110 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,74,546 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,04,900, అన్నదానానికి రూ.17,664 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.

Similar News

News July 9, 2025

ప్రజలకు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ముఖ్య గమనిక

image

ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డులో వివరాలు, బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో ఎస్పీ మహేశ్ బి గీతేతో కలిసి జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని ఆయన నిర్వహించి మాట్లాడారు. పౌరులందరికీ తప్పనిసరిగా ఆధార్ కార్డును జారీ చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News July 9, 2025

వేములవాడ: ప్రభుత్వ ఆస్పత్రిలో మాక్ డ్రిల్

image

అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆసుపత్రి సిబ్బందిలో అప్రమత్తత పెంచేందుకు అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే ఎలా స్పందించాలి, రోగులను ఎలా సురక్షితంగా తరలించాలి, ఎమర్జెన్సీ సిగ్నల్స్‌ను ఎలా ఉపయోగించాలని ప్రాక్టికల్ డెమో నిర్వహించారు.

News July 9, 2025

తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరల్లో కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹660 తగ్గి ₹98,180కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹600 తగ్గి ₹90,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.