News March 24, 2025

విశాఖలో పలు సంస్థల డ్రైవర్లకు అవగాహన

image

విశాఖ కలెక్టర్ ఆదేశాల మేరకు ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థల యాజమాన్యాలకు, డ్రైవర్లకు ఉప రవాణా కమీషనర్ కార్యాలయంలో ఆదివారం అవగాహనా నిర్వహించారు. డ్రైవర్‌ అలర్ట్ సందేశాల వెళ్ళకుండా చూడాలని యాజమాన్యనికి.. రహదారి నియమ నిభందనలు పాటించాలని డ్రైవర్లకు సూచించారు. డ్రైవర్లకు ఎప్పటికప్పుడు రహదారి భద్రత నియమాలపై అవగాహన కల్పించాలని సంస్థల యాజమాన్యనికి ఇన్ ఛార్జ్ ఉపరవాణా కమీషనర్ ఆర్‌సి‌హెచ్ శ్రీనివాస్ తెలిపారు.

Similar News

News March 26, 2025

ముఖ్యమంత్రి చేపట్టిన సదస్సులో పాల్గొన్న విశాఖ కలెక్టర్

image

రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మూడో విడత కలెక్టర్ల సదస్సు జరుగుతుంది. ఇందులో భాగంగా బుధవారం జరుగుతున్న సదస్సులో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పీ -4 సర్వే, పలు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో అనకాపల్లి కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఉన్నారు.

News March 26, 2025

గాజువాకలో యువకుడి సూసైడ్ 

image

గాజువాక మండలం B.C రోడ్డులోని వాంబేకాలనీలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న పవన్(21) ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక పరిస్థితులే కారణంగా చనిపోతున్నట్లు మృతుడు సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

News March 26, 2025

మేయర్ పీఠం.. విశాఖ అభివృద్ధికి శాపం కానుందా?

image

విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు GVMC బడ్జెట్‌పై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2025-26కి సంబంధించి బడ్జెట్ సమావేశాన్ని ఈనెల 29న నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అయితే అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో YCP కార్పొరేటర్లను బెంగుళూరు తరలించారు. మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్లూ YCPకి చెందిన వారే కావడంతో వారి హాజరుపై అనుమానం నెలకొంది. దీంతో సమావేశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

error: Content is protected !!