News March 24, 2025
నేడు నల్గొండకు మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ జిల్లాకు నేడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రానున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 9 గంటలకు నల్గొండలోని మంత్రి క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారు. 9.30 గంటలకు అర్జలాబావిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 10.30 గంటలకు తిప్పర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు.
Similar News
News March 26, 2025
సీజన్ ముగిసిన.. రైతుకు దక్కని భరోసా!

నల్గొండ జిల్లాలో రైతు భరోసా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ఇప్పటివరకు యాసంగి సీజన్‌కు సంబంధించి మూడెకరాల లోపు 2, 76,694 మంది ఖాతాల్లో మాత్రమే ప్రభుత్వం నిధులు జమ చేసింది. మూడు ఎకరాలకు పైగా ఉన్న సుమారు 3. 30 లక్షల మంది రైతులు రైతు భరోసా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సీజన్ ముగిసినా ఎప్పుడు ఇస్తారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
News March 26, 2025
నల్గొండలో ఈనెల 27న జాబ్ మేళా

పలు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకుగాను ఈనెల 27న నల్గొండ పట్టణంలోని ఐటీఐ క్యాంపస్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారిని పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలో ఎంపిక అయినవారు నల్గొండ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News March 25, 2025
ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు సంపూర్ణ సహకారం అందించాలి: కలెక్టర్

రబీ ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో రబీ ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లు, పౌరసరఫరాలు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లర్ల సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు సానుకూలతతో ఉంటుందని తెలిపారు.