News March 25, 2024

చిత్తూరు: అన్న ఎంపీగా.. తమ్ముడు ఎమ్మెల్యేగా పోటీ

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో నల్లారి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. అన్నదమ్ములైన కిరణ్, కిషోర్ లు తక్కువకాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో వారికంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. AP అసెంబ్లీ స్పీకర్, CMగా కిరణ్ బాధ్యతలు నిర్వర్తించారు. TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా కిషోర్ కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల బరిలో పీలేరు అసెంబ్లీ స్థానానికి కిషోర్, రాజంపేట MP స్థానానికి కిరణ్ పోటీ పడుతున్నారు.

Similar News

News September 28, 2025

చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.117 నుంచి 135, మాంసం రూ.170 నుంచి 200 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.193 నుంచి 225 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.195 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News September 27, 2025

గర్భిణీల నమోదు 100% జరగాలి: చిత్తూరు కలెక్టర్

image

PHCలలో గర్భిణీల నమోదు 100% జరగాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గర్భిణీల రిజిస్ట్రేషన్ నమోదు కాకాపోతే వాటికి రాతపూర్వక కారణాలను ఇవ్వాలన్నారు. వైద్యులు రోజువారి మానిటర్ చేయాలన్నారు. పొరపాటు ఉంటే వైద్యులపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మ్యాపింగ్ పైన ఇబ్బందులు ఉంటే సరి చూసుకోవాలన్నారు.

News September 26, 2025

పిల్లల ఆరోగ్యంపై తనిఖీలు నిర్వహించాలి: JC

image

ప్రతి వారం బాలల సంరక్షణ కేంద్రాలలో పిల్లల ఆరోగ్యంపై తనిఖీలు నిర్వహించాలని చిత్తూరు జేసీ విద్యాధరి ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాస్థాయి బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీలకు సంబంధించిన అంశాలపై కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. పిల్లల ఆరోగ్య సమస్యలను డాక్టర్ల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చికిత్స అందించాలన్నారు.