News March 24, 2025

వరంగల్: నగర అభివృద్ధికి సహకరించండి: కమిషనర్

image

పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని GWMC కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే నగర ప్రజలను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరపు పన్నులు చెల్లించడానికి కేవలం 8రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, దీర్ఘకాలంగా పన్నులు చెల్లించని వారికి ఇప్పటికే రెడ్ నోటీసులు అందించి ఆస్తులను జప్తు చేస్తున్నామని హెచ్చరించారు. 

Similar News

News March 26, 2025

ఓట్ల కోసమే విభజన రాజకీయం: యోగి

image

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో కొంతమంది దేశంలో విభజనలను సృష్టిస్తున్నారని UP CM యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఇతరులను కించపరచడం సరికాదని చట్టం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఓట్ల కోసమే ప్రాంతం, భాష పేరుతో ప్రాంతాల మధ్య విభేదాలు తెస్తున్నారని, యూపీలో తెలుగు, తమిళ భాషలు నేర్చుకుంటున్నప్పుడు తమిళనాడులో హిందీ నేర్చుకుంటే తప్పేంటి అని యోగి ప్రశ్నించారు.

News March 26, 2025

నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

image

నిజామాబాద్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం మల్కాపూర్లో అత్యధికంగా 40.2℃ఉష్ణోగ్రత నమోదైంది. అటు నిజామాబాద్ పట్టణం, మంచిప్ప, కోటగిరిలో 40, మోస్రా 39.9, ధర్పల్లి, లక్మాపూర్ 39.8, యెడపల్లె, మెండోరా 39.7, ఎర్గట్ల, పెర్కిట్, మోర్తాడ్ 39.5, వేంపల్లి, వైల్‌పూర్ 39.3, సిరికొండ, ముప్కాల్, కమ్మర్పల్లి, తుంపల్లి 39.2, మాచర్ల, భీంగల్లో 39.1℃ఉష్ణోగ్రత నమోదైంది.

News March 26, 2025

పోరాటయోధుడు ధర్మభిక్షం

image

స్కూల్లో తన పట్టాభిషేక రజతోత్సవాలను జరపాలన్న నిజాం ఆదేశాలను ధిక్కరించి సంచలనం సృష్టించాడో విద్యార్థి. ఆయనే బొమ్మగాని ధర్మభిక్షం. NLG జిల్లా ఊకొండిలో 1922 ఫిబ్రవరి 15న లింగయ్య గౌడ్, పద్మ దంపతులకు జన్మించాడు ధర్మభిక్షం. 1942లో CPIలో చేరి నిజాంపై సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టి యుద్ధరంగంలోకి దిగి, సాయుధ పోరాటాన్ని విస్తరించారు. మూడు సార్లు MLAగా, రెండు సార్లు MPగా గెలుపొందారు. నేడు ఆయన వర్ధంతి

error: Content is protected !!