News March 24, 2025

HYD: ఏప్రిల్ 1 నుంచి స్కిల్ ఎడ్యుకేషన్ మేళా

image

కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గల సాఫ్ట్వేర్ స్కిల్ కోర్సుల్లో విద్యార్దులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 15 రోజుల పాటు స్కిల్ ఎడ్యుకేషన్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మణికొండలోని కార్యాలయంలో స్వయంగా గాని, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Similar News

News March 26, 2025

ఓట్ల కోసమే విభజన రాజకీయం: యోగి

image

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో కొంతమంది దేశంలో విభజనలను సృష్టిస్తున్నారని UP CM యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఇతరులను కించపరచడం సరికాదని చట్టం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఓట్ల కోసమే ప్రాంతం, భాష పేరుతో ప్రాంతాల మధ్య విభేదాలు తెస్తున్నారని, యూపీలో తెలుగు, తమిళ భాషలు నేర్చుకుంటున్నప్పుడు తమిళనాడులో హిందీ నేర్చుకుంటే తప్పేంటి అని యోగి ప్రశ్నించారు.

News March 26, 2025

నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

image

నిజామాబాద్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం మల్కాపూర్లో అత్యధికంగా 40.2℃ఉష్ణోగ్రత నమోదైంది. అటు నిజామాబాద్ పట్టణం, మంచిప్ప, కోటగిరిలో 40, మోస్రా 39.9, ధర్పల్లి, లక్మాపూర్ 39.8, యెడపల్లె, మెండోరా 39.7, ఎర్గట్ల, పెర్కిట్, మోర్తాడ్ 39.5, వేంపల్లి, వైల్‌పూర్ 39.3, సిరికొండ, ముప్కాల్, కమ్మర్పల్లి, తుంపల్లి 39.2, మాచర్ల, భీంగల్లో 39.1℃ఉష్ణోగ్రత నమోదైంది.

News March 26, 2025

పోరాటయోధుడు ధర్మభిక్షం

image

స్కూల్లో తన పట్టాభిషేక రజతోత్సవాలను జరపాలన్న నిజాం ఆదేశాలను ధిక్కరించి సంచలనం సృష్టించాడో విద్యార్థి. ఆయనే బొమ్మగాని ధర్మభిక్షం. NLG జిల్లా ఊకొండిలో 1922 ఫిబ్రవరి 15న లింగయ్య గౌడ్, పద్మ దంపతులకు జన్మించాడు ధర్మభిక్షం. 1942లో CPIలో చేరి నిజాంపై సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టి యుద్ధరంగంలోకి దిగి, సాయుధ పోరాటాన్ని విస్తరించారు. మూడు సార్లు MLAగా, రెండు సార్లు MPగా గెలుపొందారు. నేడు ఆయన వర్ధంతి

error: Content is protected !!