News March 24, 2025

నితీశ్ కుమార్ మెంటల్లీ అన్‌ఫిట్: ప్రశాంత్ కిశోర్

image

బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేయాలని జన్ సూరజ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్ డిమాండ్ చేశారు. క్షీణిస్తున్న మానసిక, శారీరక ఆరోగ్యం కారణంగా ఆయన ఇకపై పాలించడానికి తగినవారు కాదని అన్నారు. ‘నితీశ్ కుమార్ మెంటల్లీ అన్‌ఫిట్. ఎవరికైనా డౌట్ ఉంటే మంత్రుల పేర్లు చెప్పమని అడగండి. ఆయన పరిస్థితి గురించి ప్రధాని మోదీ, అమిత్ షాకు తెలియదంటే నమ్మలేకపోతున్నా’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News March 29, 2025

బీటెక్ ఫెయిలైన వారికీ సర్టిఫికెట్

image

TG: నాలుగేళ్ల బీటెక్ కోర్సులో 50 శాతం సబ్జెక్టులు పాసైనా ఓ సర్టిఫికెట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై విధివిధానాలు రూపొందించేందుకు ఓ కమిటీని నియమించనుంది. ప్రస్తుతం బీటెక్‌లో 160 క్రెడిట్లు(ఒక్కో సెమిస్టర్‌కు 20) ఉంటాయి. ఒక్క సబ్జెక్ట్ ఫెయిలైనా పట్టా రాదు. కొత్త విధానంతో సగం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధిస్తే విద్యార్థులకు సర్టిఫికెట్ వస్తుంది. దీంతో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు.

News March 29, 2025

డేటింగ్ యాప్‌లో ప్రేమ.. రూ.6.5 కోట్లు పోగొట్టుకున్నాడు

image

డేటింగ్ యాప్‌లో పరిచయమైన మహిళను నమ్మి ఓ వ్యక్తి ₹6.5Cr పోగొట్టుకున్నాడు. నోయిడాకు చెందిన దల్జీత్‌సింగ్ ఓ సంస్థకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. భార్యతో విడాకులు కావడంతో ప్రేమ కోసం యాప్‌లో ప్రయత్నించగా అనిత పరిచయమైంది. ట్రేడింగ్ కంపెనీల్లో పెట్టుబడులతో డబ్బు సంపాదించొచ్చని నమ్మించింది. తొలుత ₹3.2Lకు గంటల్లోనే ₹24K లాభం చూపింది. దీంతో ₹6.5Cr ఇన్వెస్ట్ చేయగా ముంచేయడంతో అతను పోలీసులను ఆశ్రయించాడు.

News March 29, 2025

బుమ్రా ఎప్పుడొస్తారో చెప్పలేం: జయవర్ధనే

image

పేసర్ జస్ప్రీత్ బుమ్రా బాగా కోలుకున్నారని ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్ధనే తెలిపారు. అయితే ఎంట్రీ ఎప్పుడన్నది చెప్పలేమని తెలిపారు. ‘బుమ్రాను ఫలానా మ్యాచ్‌లోపు తీసుకురావాలన్నదేమీ మేం పెట్టుకోలేదు. తన రోజూవారీ వర్కవుట్స్‌ను క్రమం తప్పకుండా ఏ సమస్యా లేకుండా పూర్తి చేస్తున్నాడు. ఎప్పటి నుంచి ఆడొచ్చనదానిపై NCA ఏ క్లారిటీ ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు. BGT సమయంలో బుమ్రాకు వెన్నెముక గాయమైంది.

error: Content is protected !!