News March 24, 2025
ఖైరతాబాద్: కారు కడిగితే రూ.10,000 కట్టాల్సిందేనా..?

అదేంటి మా కారు మేము కడిగితే రూ.10వేలు ఎందుకు కట్టాలి అని అనుకుంటారు. మీరు కాదులెండి. జలమండలి సరఫరా చేసే నీటితో విచ్చలవిడిగా కార్లు కడిగిన వారికి ఈ భారీ జరిమానా విధించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులకు సూచించారు. సరఫరా చేస్తున్న నీటిని విచ్చలవిడిగా వృథా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులు ఆలోచిస్తున్నారు. అయినా మంచినీటితో కారును ఎందుకు కడగాలి? అనేది మనం ఆలోచించాలి.
Similar News
News October 31, 2025
HYDలో రోడ్డు భద్రతకు GHMC కొత్త యాప్

నగర రోడ్ల భద్రతకు GHMC యాప్ తీసుకొచ్చింది. ఫీల్డ్ ఇంజినీర్లు రోడ్ల పరిస్థితిని పరిశీలించి, సమాచారాన్ని అప్డేట్ చేయడానికి ‘పీరియాడిక్ పబ్లిక్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ యాప్’ స్టార్ చేసింది. ఇందులో పాత్‌హోల్స్, మాన్హోల్స్, రాళ్లు, ఓపెన్ ఎలక్ట్రికల్ బాక్స్‌లు, బ్యారికేడింగ్ సమస్యలు గుర్తించి జియోట్యాగ్ ఫొటోలను అప్లోడ్ చేస్తారు. వాటిమీద యాక్షన్ తీసుకుంటున్నారా, లేదా తెలుసుకోవచ్చు.
SHARE IT
News October 31, 2025
హీట్ రాజుకున్న జూబ్లీహిల్స్ బైపోల్

జూబ్లీ బైపోల్ ప్రచారం తారస్థాయికి చేరింది. ఇప్పటికే కాంగ్రెస్, BRS, BJP ఇక్కడ మకాం వేశాయి. నేడు సీఎం రేవంత్‌రెడ్డి, KTR రోడ్‌షో నిర్వహించనున్నారు. ఒకేరోజు ఇరుపార్టీల కీలకనేతలు ప్రచారంలో పాల్గొననుండటం, MIM నుంచి పలువురు నేతలు BRSలో చేరనున్నారని వార్తలు రావడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్ర రాజకీయాలన్నీ జూబ్లీహిల్స్ వైపే మళ్లాయి. ప్రచారంలో వీరిద్దరు ఏం మాట్లాడతారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
News October 31, 2025
Rewind: నిజాం నవాబుకు.. పటేల్ జవాబు

1947లో దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుతుంటే.. HYD సంస్థానం నిజాం నిరంకుశ పాలనలో నలుగుతోంది. రజాకారుల దౌర్జన్యాలు, అరాచకాలతో జనాలు తల్లడిల్లుతున్నారు. సంస్థానాన్ని PAKలో కలపాలని ఖాసీంరజ్వీ కుట్ర పన్నాడు. ఇది చూసి పటేల్ హృదయం రగిలింది. నిజాం బంధనాల నుంచి విడిపించాలని సంకల్పించారు. భారత బలగాలను నగరానికి పంపారు. కేవలం 108 గంటల్లో అసఫ్‌జాహీ పాలనకు తెరదించారు.
*నేడు సర్దార్ పటేల్ జయంతి. సలాం సర్దార్.


