News March 24, 2025
వనపర్తి జిల్లాకు YELLOW ALERT..⚠️

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని, ఆ తర్వాత క్రమంగా 2-3 డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది.
Similar News
News November 5, 2025
CCRHలో 90 పోస్టులు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (<
News November 5, 2025
భార్యాభర్తల మధ్య అనుబంధాల కోసం..

కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ వ్రతంలో భాగంగా మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్లను బూరెలుగా, ఆకులను విస్తర్లుగా ఉపయోగించి పూజించడం సంప్రదాయం. నేడు శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల పూజాఫలం, పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని, ఇహపరలోకాలలో సుఖసౌఖ్యాలు, ముక్తి లభిస్తాయని పండితులు అంటున్నారు.
News November 5, 2025
సిరిసిల్ల కవి ‘జిగిరి’ నవలకు దేశవ్యాప్త గుర్తింపు

సిరిసిల్లకు చెందిన ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రచించిన ‘జిగిరి’ నవల దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందింది. ఈ నవలను ఇంగ్లిష్, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం, బెంగాలీ, ఒడియా, పంజాబీ, సింధీ, మలయాళం తదితర 10 భాషల్లోకి అనువదించారు. ఒడియా, పంజాబీ భాషల్లో 2 సార్లు అనువాదమవ్వడంతో మొత్తం 12 అనువాదాల ఘనతను ఈ నవల సాధించింది. కాగా, తెలుగు సాహిత్యంలో ఒకే నవల ఇన్ని భాషల్లోకి అనువాదం అవ్వడం చాలా అరుదు.


