News March 24, 2025

CUET UG దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్

image

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులను సవరించుకునేందుకు NTA అవకాశం కల్పించింది. మే 8 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. సెంట్రల్, స్టేట్, ప్రైవేట్ వర్సిటీల్లో UG కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను CBT విధానంలో 13 భాషల్లో నిర్వహించనున్నారు.
వెబ్‌సైట్: https://cuet.nta.nic.in/

Similar News

News March 26, 2025

పాస్టర్ మృతిపై చంద్రబాబు విచారం.. విచారణకు ఆదేశం

image

AP: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ కేసులో అన్ని కోణాల్లోనూ విచారణ జరపాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ కన్నుమూశారు. అది హత్యేనని, ప్రభుత్వం దర్యాప్తు చేయించాలని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తుండటంతో సీఎం స్పందించారు. ప్రత్యేక బృందాలు కేసును దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది.

News March 26, 2025

యూజర్లకు షాక్: త్వరలో రీఛార్జ్ ధరల పెంపు?

image

త్వరలో వినియోగదారులకు టెలికామ్ కంపెనీలు బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొబైల్ రీఛార్జ్ ధరలను సవరించేందుకు కంపెనీలు సిద్ధమైనట్లు సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఈ ఛార్జీల పెంపు వల్ల టెలికాం కంపెనీలకు మరింత ఆదాయం వస్తుందని అంచనా వేసింది. 2019లో ఓసారి, 2021లో ఓసారి, 2024లో ఒకసారి ఇలా మూడు సార్లు (2019 DECలో, 2021 NOVలో, 2024 JULYలో) టారిఫ్‌లను పెంచాయి.

News March 26, 2025

భారత ఎన్నికల వ్యవస్థపై ట్రంప్ ప్రశంసలు.. ఎందుకంటే!

image

భారత్ సహా కొన్ని వర్ధమాన దేశాల ఎన్నికల వ్యవస్థలను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఇకపై దేశంలో ఓటు హక్కు నమోదుకు పౌరసత్వ పత్రాలను చూపాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ‘స్వపరిపాలనలో అత్యున్నతంగా ఉన్నప్పటికీ ఎన్నికల భద్రతలో వర్ధమాన దేశాలతో పోలిస్తే US విఫలమైంది. భారత్, బ్రెజిల్ వంటివి బయోమెట్రిక్‌ డేటాబేస్‌ (ఆధార్‌)తో ఓటరు గుర్తింపును ముడిపెట్టాయి’ అని ఆయన వివరించారు.

error: Content is protected !!