News March 24, 2025
IPL: నేడు వైజాగ్‌లో LSGvsDC

ఐపీఎల్‌లో ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 5 సార్లు తలపడగా LSG 3, DC 2 మ్యాచుల్లో గెలిచింది. వేలంలో ఈ రెండు జట్ల మధ్య పంత్, KL రాహుల్ స్వాప్ అవ్వడం కూడా ఈ మ్యాచుపై మరింత ఆసక్తిని పెంచుతోంది. రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్ చూడవచ్చు.
Similar News
News March 29, 2025
‘మ్యాడ్ స్క్వేర్’ తొలిరోజు భారీ కలెక్షన్లు

నార్నె నితిన్, సంగీత్, రామ్ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. దీంతో తొలిరోజు భారీగా వసూళ్లు రాబట్టినట్లు టీటౌన్ వర్గాలు తెలిపాయి. మొదటిరోజు ఏకంగా రూ.17 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. బ్రేక్ ఈవెన్ విలువ రూ.45 కోట్లు కాగా తొలిరోజే 40శాతం రికవరీ చేసినట్లు వెల్లడించాయి. లాంగ్ వీకెండ్ కావడంతో భారీగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
News March 29, 2025
అమెరికా సుంకాలు భారత్‌కు మంచిదే: నీతి ఆయోగ్

చైనా, మెక్సికో, కెనడా దేశాలపై వచ్చే నెల 2 నుంచి US విధించనున్న అదనపు సుంకాలు భారత్ మంచికేనని నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రవాకర్ సాహూ అభిప్రాయపడ్డారు. ‘ప్రాథమికంగా చూస్తే ట్రంప్ ప్రతీకార సుంకాలు భారత్‌ను మరీ ఇబ్బంది పెట్టవు. ఏవో కొన్ని రంగాలు స్వల్పంగా ప్రభావితమవుతాయి. కానీ దీని వల్ల అపారమైన అవకాశాలు కూడా ఉన్నాయి’ అని వివరించారు. US దిగుమతుల్లో 50శాతం చైనా, మెక్సికో, కెనడా నుంచే ఉన్నాయి.
News March 29, 2025
ఉపాధి హామీ కూలీల వేతనం పెంపు

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.300 నుంచి రూ.307కి పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు రూ.7 పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి పెంచిన వేతనం అమల్లోకి రానుంది.