News March 24, 2025

గుంటూరు జిల్లా ఎస్పీ వార్నింగ్

image

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదివారం ఓ ప్రకటనలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. గతంలో బెట్టింగులకు పాల్పడిన పాత నేరస్తుల వివరాలను సేకరించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అన్నారు.

Similar News

News March 26, 2025

తాడేపల్లి: పాస్టర్ ప్రవీణ్ మృతిపై వైఎస్ జగన్ విచారం

image

మత ప్రబోదకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మాజీ సీఎం వైయస్‌ జగన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. పాస్టర్‌, మత ప్రబోదకుడు ప్రవీణ్‌ పగడాల మృతి అత్యంత బాధాకరమని, ప్రవీణ్‌ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రవీణ్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు.

News March 26, 2025

ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెరిగేలా పోలీసింగ్ ఉండాలి: చంద్రబాబు

image

స‌చివాల‌యంలో బుధవారం జరిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో పోలీసు శాఖ‌, శాంతిభ‌ద్ర‌త‌ల‌పై చ‌ర్చ జ‌రిగింది. సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీసు శాఖ‌కు మంచి గుర్తింపు ఉందని, రాష్ట్రంలో జీరో క్రైమ్ ల‌క్ష్యంగా పోలీసు శాఖ వినూత్న ప్ర‌ణాళిక‌ల‌తో కార్యాచ‌ర‌ణ దిశ‌గా అడుగులేయాలన్నారు. ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెరిగేలా పోలీసింగ్ ఉండాలన్నారు. ఆధునిక టెక్నాల‌జీ విరివిగా ఉపయోగించుకోవాలన్నారు.

News March 26, 2025

తాడేపల్లి: పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై సీఎం చంద్రబాబు విచారం

image

హైదరాబాద్‌కు చెందిన పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. పాస్టర్ మృతి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడారు. చాగల్లులో జరిగే క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు రాత్రి ద్విచక్ర వాహనంపై రాజమండ్రి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

error: Content is protected !!