News March 24, 2025
తిరుపతి: విహార యాత్రకు వస్తుండగా విషాదం

సెలవు రోజున సరదాగా గడుపుదామని ఉబ్బల మడుగు వస్తున్న తమిళనాడు వాసులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన ఆదివారం తడ వద్ద చోటు చేసుకుంది. పెరియా వట్టు వద్ద తమిళనాడు ప్రమాణికుల కారు ఓవర్ స్పీడ్ కారణంగా చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఫాతిమా, దీనా మృతి చెందారు. కాగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు చెన్నైలో చికిత్స అందిస్తున్నారు.
Similar News
News September 14, 2025
జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7,444 కేసులలో రాజీ

జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7,444 కేసులలో రాజీ జరిగిందని NZB CP సాయి చైతన్య జాతీయ మెగా లోక అదాలత్ లో భాగంగా వివిధ కేసులలో రాజీ పడి పరిష్కారం అయినందునకు నిజామాబాద్ జిల్లాకు 4వ స్థానం దక్కిందని, సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన రూ.42,45,273-00ను సైతం తిరిగి సైబర్ బాధితులకు అందజేసినట్లు వివరించారు. జిల్లాను అగ్రగామిగా ఉంచడంలో కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు.
News September 14, 2025
నల్గొండ: లోక్ అదాలత్‌లో 13,814 కేసుల పరిష్కారం

జాతీయ మెగా లోక్ అదాలత్‌లో నల్గొండ జిల్లాలో 13,814 కేసులు పరిష్కారమయ్యాయి. జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు లోక్ అదాలత్ విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించిన 135 సైబర్ క్రైమ్ కేసుల బాధితులకు రూ. 54,08,392 తిరిగి చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు.
News September 14, 2025
HYD: ‘BRS విష ప్రచారాలను తిప్పి కొట్టాలి’

గ్రూప్-1 పరీక్షపై BRS చేస్తున్న విష ప్రచారాలను ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తల తిప్పికొట్టాలని రాష్ట గ్రంథాలయ ఛైర్మన్ రియాజ్ పిలుపునిచ్చారు. హైకోర్ట్ తీర్పును తాము ఎల్లప్పుడూ గౌరవిస్తామని స్పష్టంచేశారు. గ్రూప్-1 పోస్టులు అమ్ముకున్నారని మాట్లాడిన KTRపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని BRS నాయకులకు హితవు పలికారు.