News March 24, 2025

రాజమండ్రి: మర్డర్ కేసులో పట్టుబడ్డ నిందితుడు

image

రాజమండ్రి రూరల్ హుకుంపేట డీ బ్లాక్‌లో ఆదివారం తల్లీ కుమార్తెలు ఎండీ సల్మాన్, ఎండీ సానియా మర్డర్ కేసులో నిందితుడు పల్లి శివకుమార్ పోలీసులకు పట్టుబడ్డాడు. కాగా నిందితుడు ముళ్ల కంచెలలో నుంచి పరారవుతున్న సమయంలో కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి వెంబడించారు. నిందితుడి నుంచి ప్రతిఘటన ఎదురవడంతో ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయి. విధి నిర్వహణలో ధైర్యసాహసాలతో ఎస్సై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News March 28, 2025

అనపర్తి: కాలువలో పడి 4ఏళ్ల చిన్నారి మృతి

image

అనపర్తి మండలం కొప్పవరంలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. 4ఏళ్ల చిన్నారి అనూష భార్గవి ప్రమాదవశాత్తు కాలువలో పడి చనిపోయింది. చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటూ కనిపించకుండా పోయిందని తండ్రి దొరబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇంటి పక్కనే పంట కాలువ ఉండడంతో ఆ కోణంలో పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం పాప మృతదేహం లభించింది.

News March 28, 2025

కొవ్వూరు: ప్రభాకర్ మర్డర్ కేసులో వీడని మిస్టరీ..

image

కొవ్వూరు మండలం దొమ్మేరులో గురువారం జరిగిన పి.ప్రభాకర్ మర్డర్ కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. ఆయుర్వేదం షాప్ నడుపుతున్న ఆయనకు బుధవారం రాత్రి ఫోన్ కాల్ రావడంతో బయటికి వెళ్లి పొలంలో విగతజీవిగా మారాడు. దుండగులు అతడిపై కత్తితో దాడి చేసి కుడి చేతిని నరికి హస్తాన్ని తీసుకుపోయారు. సీసీ ఫుటేజ్, చివరి ఫోన్ కాల్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఏఎస్పీ సుబ్బరాజు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరుగుతోంది.

News March 28, 2025

RJY: జిల్లాలోని అభివృద్ధి ప్రతిపాదనలకు సీఎం ఆమోదం

image

జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు రెండు రోజులు పాటు నిర్వహించిన సమావేశంలో తూ. గో జిల్లా తరఫున నివేదించిన పలు ప్రతిపాదనలకు ఆమోదించినట్లు కలెక్టర్ పి. ప్రశాంతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మౌలిక సదుపాయాలు, సేవా రంగం, పర్యాటక అనుబంధ రంగాలు, హైవేల అభివృద్ధి, నర్సరీ రైతులకి ఉపాధిహామీ పని దినాలు కల్పన, తదితర అంశాల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.

error: Content is protected !!