News March 24, 2025

బాపట్ల: సీఎం పర్యటించేది ఈ గ్రామంలోనే.!

image

సీఎం నారా చంద్రబాబు ఏప్రిల్ 1న పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం మండలం పెదగంజాం గ్రామంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వెల్లడించారు. గ్రామంలో ఆరోజు జరిగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని ఆయన తెలిపారు. కాగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు.

Similar News

News March 26, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో 252 మంది గైర్హాజరు

image

శ్రీ సత్యసాయి జిల్లాలో బుధవారం జరిగిన పదో తరగతి ఫిజిక్స్ పరీక్షకు 262 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 227 మంది, ప్రైవేట్ విద్యార్థులు 25 మంది గైర్హాజరు అయ్యారన్నారు. జిల్లాలోని 104 కేంద్రాలలో పరీక్షలు జరిగినట్లు చెప్పారు.

News March 26, 2025

గద్వాల POLITICS.. కాంగ్రెస్ ప్రక్షాళన..?

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో రేపు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. కాగా గద్వాల డీసీసీ చీఫ్‌గా నల్లారెడ్డి ఉన్నారు. అయితే ఈ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్ ఆశావహుడిగా ఉన్నా మరోసారి నల్లారెడ్డికే పదవి ఇస్తారని టాక్.

News March 26, 2025

పోలీసుల అదుపులో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి!

image

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని సోమందేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. <<15892859>>రామగిరి<<>> ఎంపీడీవో కార్యాలయం వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వైసీపీ శ్రేణులకు మద్దతుగా వెళ్తున్న ఆయనను జాతీయ రహదారిపై డీఎస్పీ వెంకటేశ్వర్లు అదుపులోకి తీసుకున్నారు. మీరు అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసులు ఆయనకు చెప్పారు. 

error: Content is protected !!