News March 24, 2025

HYD MMTSలో యువతిపై అత్యాచారయత్నం

image

సికింద్రాబాద్ TO మేడ్చల్ MMTSలో ఓ యువతిపై దుండగుడు అత్యాచారానికి యత్నించాడు. యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై అత్యాచారానికి యత్నించగా.. కదులుతున్న ట్రెయిన్‌లో నుంచి ఆ యువతి దూకేసింది. తీవ్రగాయాలైన ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 29, 2025

IPL: నేడు ముంబైVSగుజరాత్

image

IPLలో ఇవాళ ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లో రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి మ్యాచుకు దూరమైన MI కెప్టెన్ హార్దిక్ ఇవాళ తుది జట్టులోకి రానున్నారు. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు 5 సార్లు తలపడ్డాయి. మూడింట్లో GT, రెండింట్లో MI గెలిచింది. టాస్ గెలిచిన టీమ్ బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ సీజన్‌ను రెండు జట్లు ఓటమితోనే ఆరంభించాయి. నేడు గెలుపు బోణీ కొట్టేదెవరో?

News March 29, 2025

MDCL: స్వయం సహాయక సంఘాలకు ఉగాది కానుక

image

కాంగ్రెస్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ఉగాది కానుకగా, బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించిన వారికి ఒక్క రూపాయి వడ్డీని తిరిగి చెల్లించే నిర్ణయం తీసుకుంది. ఈ నిధులను సంబంధిత బ్యాంకుల ఖాతాల్లో జమ చేయించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు రూ.5.66 కోట్లు చెల్లించి, జిల్లాలోని 3910 స్వయం సహాయక సంఘాలకు గత సంవత్సరం చెల్లించిన వన్ రూపీ వడ్డీ తిరిగి చెల్లించడం జరిగిందని అధికారులు తెలిపారు.

News March 29, 2025

బేగంపేట AIRPORT కింద సొరంగం.. గ్రీన్ సిగ్నల్ !

image

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం రన్‌వే కింద నుంచి 600 మీటర్ల పొడవు HMDA ఎలివేటెడ్ కారిడార్ అలైన్మెంట్ తీసుకెళ్తున్నట్లు HYD మెట్రో రైల్ సంస్థ తెలిపింది. ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు స్ట్రీప్ కర్వ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. విమానాశ్రయం కింద సొరంగం నిర్మించేందుకు AAI తాజాగా అనుమతి లభించగా.. HMDA టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

error: Content is protected !!