News March 24, 2025

MBNR: 24న ఆశావర్కర్స్ ‘చలో హైదరాబాద్’

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆశా కార్యకర్తలు CITU ఆధ్వర్యంలో తమ సమస్యలపై గళమెత్తారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కురుమూర్తి మాట్లాడుతూ.. కార్మికులకు రూ.18 వేతనం, పీఎఫ్, ఈపీఎఫ్, గ్రాటివిటీ, పెన్షన్ ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆశాకార్యకర్తలు వచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

Similar News

News March 29, 2025

MBNR: నేషనల్ ఖో-ఖో జట్టుకు ఎంపిక

image

మహబూబ్ నగర్ జిల్లా నుంచి 57వ సీనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్ షిప్-2024-25కు మంగలి శ్రీలక్ష్మి, కే.శ్వేత, ఎరుకలి శశిరేఖ ఎంపికయ్యారు. వీరు తెలంగాణ రాష్ట్రం ఖోఖో మహిళా జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఒడిశాలో ఈనెల 31 నుంచి వచ్చేనెల 4 వరకు ఈ టోర్నీ జరగనుంది. దీంతో ఎంపికైన క్రీడాకారులకు ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, ఉమ్మడి జిల్లా నేతలు, తదితరులు అభినందించారు. CONGRATULATIONS❤

News March 29, 2025

MBNR: ‘న్యాయమైన ప్రాతినిధ్యం, రాజకీయ రిజర్వేషన్ల కల్పించాలి’

image

వెనుకబడిన తరగతులకు న్యాయమైన ప్రాతినిధ్యం, రాజకీయ రిజర్వేషన్ల కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం బెంగళూర్‌లోనీ ప్రెస్ క్లబ్ ఆఫ్ బెంగళూర్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జనాభా ఆధారంగా లోక్ సభ సీట్ల పెంపు, దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కల్పిస్తుందన్నారు. జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్ల పెంపు అన్యాయం మాత్రమే కాదు, సమాన ప్రాతినిధ్యం ప్రధాన సూత్రాలను కూడా దెబ్బతీస్తుందన్నారు.

News March 28, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

❤జడ్చర్ల:నీటి సంపులో మహిళ మృతదేహం
❤రేపు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి రాక
❤కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు
❤ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు
❤ఘనంగా “షబ్‌ -ఏ -ఖదర్‌” వేడుకలు
❤అందరికీ రుణమాఫీ చేయండి:BJP
❤గుడ్ న్యూస్ ఉగాదికి సన్నబియ్యం
❤పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
❤రంజాన్ వేళ..ఈద్గా వద్ద ఏర్పాట్లు
❤GWL:కాల్వకు నీళ్లు రాకపోతే చావే శరణ్యం
❤అమ్రాబాద్: తండ్రి మృతి పుట్టెడు దు:ఖంలో టెన్త్ ‘పరీక్ష’

error: Content is protected !!