News March 24, 2025
జగిత్యాల: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో జగిత్యాలలో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన సంజయ్ కుమార్‌పై అనర్హత వేటు పడుతుందా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. జగిత్యాలలో ఉప ఎన్నికలు జరుగుతాయా అని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?
Similar News
News March 29, 2025
సంగారెడ్డి: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు https://tgobmmsnew.cgg.gov.in వెబ్ సైట్‌లో ఏప్రిల్ 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. 21 నుంచి 55 ఏళ్లు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 29, 2025
నిజాంసాగర్: చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి మృతి

మద్యానికి బానిసై చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నిజాంసాగర్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేపల్లి గ్రామానికి చెందిన గుల బాలకృష్ణయ్య మద్యానికి బానిస అయ్యాడు. ఆరోగ్యం బాగా లేక వడ్డేపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
News March 29, 2025
మయన్మార్‌లో మరోసారి భూకంపం

తీవ్ర భూప్రకంపనలతో ఉలిక్కిపడిన మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. అంతకుముందు మయన్మార్, థాయిలాండ్‌లో 7.7 తీవ్రతతో భూకంపం రావడంతో భారీ భవనాలు నేలమట్టం అయ్యాయి. దాదాపు 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.