News March 24, 2025
రాజమండ్రి: మర్డర్ కేసులో పట్టుబడ్డ నిందితుడు

రాజమండ్రి రూరల్ హుకుంపేట డీ బ్లాక్‌లో ఆదివారం తల్లీ కుమార్తెలు ఎండీ సల్మాన్, ఎండీ సానియా మర్డర్ కేసులో నిందితుడు పల్లి శివకుమార్ పోలీసులకు పట్టుబడ్డాడు. కాగా నిందితుడు ముళ్ల కంచెలలో నుంచి పరారవుతున్న సమయంలో కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి వెంబడించారు. నిందితుడి నుంచి ప్రతిఘటన ఎదురవడంతో ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయి. విధి నిర్వహణలో ధైర్యసాహసాలతో ఎస్సై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News November 15, 2025
EVM గోదాంను పరిశీలించిన ఆదిలాబాద్ కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లా కేంద్రం శాంతినగర్‌లోని EVM గోదాంను కలెక్టర్ రాజర్షి షా శనివారం తనిఖీ చేశారు. గోదాంలో భద్రపరిచిన యంత్రాల స్థితి, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరా వ్యవస్థ, బ్యారికేడింగ్ వంటి అంశాలను ఆయన సమగ్రంగా పరీక్షించారు. EVM-VVPATల భద్రతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండకూడదన్నారు. ప్రతి నెలా నిర్వహణ పద్ధతులను కచ్చితంగా పర్యవేక్షించాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు.
News November 15, 2025
సత్యసాయి భక్తుల కోసం ‘SAI100’ యాప్

పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ‘SAI100’ యాప్‌ను ఆవిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. భక్తులు, ప్రజలకు సదుపాయాలు కల్పించేందుకు పరిపాలన విభాగం అన్ని చర్యలూ తీసుకుంటోందని చెప్పారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన ఈ యాప్‌ను భక్తులు, అధికారులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. యాప్‌లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
News November 15, 2025
పర్స్ అమౌంట్.. ఏ జట్టు దగ్గర ఎంత ఉందంటే?

వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఆటగాళ్ల <<18297320>>రిటెన్షన్, రిలీజ్<<>> ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలో జరిగే మినీ వేలం కోసం KKR వద్ద అత్యధికంగా రూ.64.3 కోట్లు, అత్యల్పంగా MI వద్ద రూ.2.75 కోట్ల పర్స్ అమౌంట్ మాత్రమే ఉంది. ఇక CSK(రూ.43.4 కోట్లు), SRH(రూ.25.5 కోట్లు), LSG(రూ.22.9 కోట్లు), DC(రూ.21.8 కోట్లు), RCB(రూ.16.4 కోట్లు), RR(రూ.16.05 కోట్లు), GT(రూ.12.9 కోట్లు), PBKS(రూ.11.5 కోట్లు) అమౌంట్ కలిగి ఉంది.


