News March 24, 2025

WGL: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

image

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో స్టేషన్ ఘనపూర్‌లో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడుతుందా? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? స్టే.ఘనపూర్‌లో ఉప ఎన్నికలు జరుగుతాయేమోనని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?

Similar News

News July 6, 2025

రేపు అమలాపురంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం

image

అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్‌లో సోమవారం యధావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ తెలిపారు. అదేవిధంగా జిల్లా పరిధిలోని మూడు రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, నాలుగు మున్సిపల్ కార్యాలయాలు, 22 మండల కేంద్రాల్లో అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News July 6, 2025

స్టాంప్ సవరణ బిల్లుతో ఉపయోగాలివే..

image

తెలంగాణ స్టాంప్ సవరణ బిల్లు-2025 తేవాలని <<16956370>>ప్రభుత్వం<<>> నిర్ణయించడంపై దీని ఉపయోగాలు ఏంటనే చర్చ మొదలైంది. చట్ట సవరణతో ప్రభుత్వ ఆదాయం పెంచుకోవచ్చని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. కార్పొరేట్ సేవల రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీని పెంచడం, రియల్ ఎస్టేట్, వాణిజ్య ఒప్పందాలకు చట్టబద్ధత కల్పించడంతో అదనపు ఆదాయం సమకూరుతుంది. నకిలీ స్టాంప్ పేపర్లు, డూప్లికేట్లు, స్కామ్‌లకు అడ్డుకట్ట వేయొచ్చు.

News July 6, 2025

నెల్లూరులో రొట్టెల పండుగ.. తొలిరోజే జనం కిటకిట

image

నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు దగ్గర బారాషహీద్ దర్గాలో సోమవారం రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి భక్తులు పలు రాష్ట్రాల నుంచి రొట్టెల పండుగ ప్రాంగణానికి విచ్చేశారు. స్వర్ణాల చెరువులో కోర్కెలు తీర్చే విధంగా భక్తులు రొట్టెలు పంచుకుంటున్నారు. ప్రారంభమైన తొలిరోజే భక్తుల తాకిడి ఎక్కువైంది. క్యూలైన్ల అన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.